Director BVS Ravi : మెగాస్టార్ తో ప్రాజెక్ట్ పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్ రవి

‘ఖడ్గం’, ‘సత్యం’, ‘తులసి’ చిత్రాలకు స్ర్కీన్‌రైటర్‌గా వ్యవహరించిన రవి....

BVS Ravi : తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రచయిత, దర్శకుడు బీవీఎస్‌ రవి(BVS Ravi) ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చారు. తిరుమల మీడియా పాయింట్‌లో మాట్లాడిన ఆయన ‘‘బాలకృష్ణ వ్యాఖ్యాతగా ‘అన్‌స్టాపబుల్‌’ కార్యక్రమం దిగ్విజయంగా కొనసాగుతోందనీ, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరైన 4వ సీజన్‌ తొలి ఎపిసోడ్‌కు అద్భుతమైన స్పందన రావడంతో స్వామివారిని దర్శించుకునేందుకు వచ్చా’’ అని పేర్కొన్నారు. తదుపరి చిత్రాల గురించి ప్రశ్నించగా ‘‘చిరంజీవి, రవితేజతో సినిమా చేయాలనుకుంటున్నా. ‘ విశ్వంభర’ పూర్తయిన తర్వాత చిరంజీవితో సినిమా చేస్తాం. చిరంజీవి డ్యాన్స్‌, ఫైట్స్‌ను ప్రేక్షకులు చూసేశారు. సామాజిక అంశాలతో ముడిపడిన చిత్రాల్లో ఆయన నటిస్తే ఆదరించారు. అగ్ర హీరోలు అలాంటి సినిమాలు చేేస్త సోషల్‌ ఎలిమెంట్స్‌ గురించి ఎక్కువ మందికి తెలుస్తుంది. మేం కూడా ఆయనతో అలాంటి చిత్రమే తీయాలనుకుంటున్నాను. ప్రస్తుతం ఓ హిందీ చిత్రానికి రచయితగా పని చేస్తున్నా. రెండు, మూడు నెలలపాటు ‘అన్‌స్ట్టాపబుల్‌’ వర్క్‌తో బిజీగా ఉంటా’’ అని అన్నారు.

Director BVS Ravi Movie Updates

‘ఖడ్గం’, ‘సత్యం’, ‘తులసి’ చిత్రాలకు స్ర్కీన్‌రైటర్‌గా వ్యవహరించిన రవి.. గోపీచంద్‌ హీరోగా ‘వాంటెడ్‌’తో దర్శకుడిగా పరిచయమయ్యారు. ఆ తర్వాత సాయి దుర్గాతేజ్‌తో ‘జవాన్‌’ తెరకెక్కించారు. ‘ క్రాక్‌’, ‘ధమాకా’, ‘మిస్టర్‌ బచ్చన్‌’ తదితర సినిమాల్లో ఆయన నటించారు.

Also Read : Nag Ashwin : కల్కి 2 పై కీలక అప్డేట్ ఇచ్చిన డైరెక్టర్

New MoviesTrendingUpdatesViral
Comments (0)
Add Comment