Buchibabu : గ్లోబల్‌స్టార్ రామ్‌చరణ్ హీరోగా ఉప్పెన ఫేం సాన బుచ్చిబాబు(Buchibabu) ‘ఆర్‌సీ16(RC16)’ వర్కింగ్ టైటిల్‌తో ఓ చిత్రం తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వృద్థి సినిమాస్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్రీదేవి కూతురు జాన్వీకపూర్ చరణ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్ పవర్‌ఫుల్ రోల్ పోషించనున్నారు. ఈ చిత్రం ప్రకటించి చాలా కాలమే అయినా ఇంకా సెట్స్ మీదకు వెళ్లలేదు. మార్చ్ నెలలో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా మొదలైన ఈ చిత్రం ఇప్పుడు రెగ్యులర్ షూట్‌కి వెళ్లనుంది. నేటి నుండి (నవంబర్ 22) నుంచి కర్నాటక రాష్ట్రంలోని మైసూర్‌లో మొదటి షెడ్యూల్ ప్రారంభం కానుంది. రామ్ చరణ్, జాన్వీలపై కీలక సన్నివేశాలు తెరకెక్కించనున్నారు దర్శకుడు బుచ్చిబాబు. వీరితోపాటు ముఖ్య తారాగణం కూడా ఉంటారు.
Director Buchibabu Comments
ఈ క్రమంలోనే డైరెక్టర్ బుచ్చిబాబు తన సోషల్ మీడియా నుండి ఆసక్తికరమైన పోస్ట్‌ని షేర్ చేశారు. మైసూర్‌లోని చాముండేశ్వరి మాత ఆలయాన్ని ఆయన దర్శించుకున్నారు. ఈ ఫోటోని షేర్ చేస్తూ.. “ది మోస్ట్ అవెయిటెడ్ మూమెంట్” అంటూ రాసుకొచ్చారు. అలాగే చాముండేశ్వరి మాత బ్లెసింగ్స్‌తో ఈ సినిమాని మొదలు పెడుతున్నట్లు పేర్కొన్నారు. మైసూరులో నాన్‌స్టాప్‌గా 15 రోజులపాటు షూటింగ్ చేస్తారని తెలిసింది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. మట్టి లాంటి కథ ఇదని ఇప్పటికే రామ్‌చరణ్ చెప్పారు.
ఇప్పటి వరకూ చేసిన చిత్రాలో ఈ చిత్రం ది బెస్ట్ అవుతుందని కూడా ఆయన ఓ వేదికపై వెల్లడించారు. ఉప్పెనతో భారీ విజయం అందుకుని నేషనల్ అవార్డు అందుకున్న దర్శకుడు సాన బుచ్చిబాబు ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పూర్తిస్థాయి కథతో పకడ్భందీగా సెట్స్ మీదకెళ్తున్నారు. ఇక రామ్‌చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ మొదలయ్యాయి. కియారా అడ్వాణీ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో సునీల్, సముద్రఖని, అంజలి కీలక పాత్రధారులు.
Also Read : Prabhas-Spirit : ఓ కొత్త ప్లానింగ్ తో ముందుకు వస్తున్న డార్లింగ్ ప్రభాస్