Director Boyapati : చంద్రబాబు నివాసానికి చేరుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను

చంద్రబాబు ఇంటికి వెళ్లే ముందు చెక్ పోస్ట్ వద్ద మీడియాతో ముచ్చటించిన బోయపాటి శ్రీను...

Director Boyapati : ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయం సాధించింది. ఇప్పటి వరకు ప్రకటించిన ఫలితాల్లో టీడీపీ, జనసేన పార్టీలు ఆధిక్యంలో ఉన్నట్లు తేలింది. తెలుగు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన కార్యకర్తలు సంబరాలు జరుపుకుంటున్నారు. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. చంద్రబాబు నాయుడుకు సినీ నటులు, రాజకీయ ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. దర్శకుడు బోయపాటి శ్రీను ఇటీవల చంద్రబాబు నాయుడును కలిశారు. అమరావతి కలకట్ట రోడ్డులోని చంద్రబాబు నివాసానికి దర్శకుడు బోయపాటి శ్రీను వెళ్లారు.

Director Boyapati….

చంద్రబాబు ఇంటికి వెళ్లే ముందు చెక్ పోస్ట్ వద్ద మీడియాతో ముచ్చటించిన బోయపాటి శ్రీను(Director Boyapati). దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బోయపాటి శ్రీను, చంద్రబాబులు ఒకరికొకరు చాలా సన్నిహితంగా మెలిగేవారు. ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార బాధ్యతలను బోయపాటికి అప్పగిస్తారనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.

కాగా, చంద్రబాబు నాయుడు తన అధికారిక నివాసంలో విజయోత్సవ సంబరాలు చేసుకున్నారు. చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్, బ్రాహ్మణి, దేవాన్ష్, బాలకృష్ణ భార్య వసుంధర, ఇతర కుటుంబ సభ్యులు కలిసి కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా లోకేష్ తన తల్లి భువనేశ్వరిని ప్రేమగా ముద్దాడారు. విక్టరీ సింబల్‌ పట్టుకుని చంద్రబాబు, భువనేశ్వరి ఫొటో దిగారు.

Also Read : Chiranjeevi : తమ్ముడి గెలుపు పై ట్వీట్ చేసిన అన్న మెగాస్టార్

Boyapati SrinuTrendingUpdatesViral
Comments (0)
Add Comment