Director Atlee: రెడ్ చిల్లీస్ ఎంటర్ టైన్ మెంట్ పతాకంపై అట్లీ దర్శకత్వంలో షారూక్ ఖాన్, విజయ్ సేతుపతి, నయనతార ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమా ‘జవాన్’. సుమారు 300 కోట్ల రూపాయలతో తెరకెక్కించిన ఈ సినిమా… ప్రపంచ వ్యాప్తంగా రూ. 1150 కోట్లకు పైగా వసూళ్లు సాధించి రికార్డు సృష్టించింది. జవాన్ సినిమాలో టైటిల్ ఎండ్ కార్డ్ లో సీక్వెల్ ఉంటుందని దర్శకుడు చెప్పకనే చెప్పాడు. ఈ నేపథ్యంలో జవాన్ సీక్వెల్ కోసం అభిమానులు ఆశక్తికరంగా ఎదురుచూస్తున్నారు. దీనితో జవన్ సీక్వెల్ పై దర్శకుడు అట్లీ(Director Atlee) తాజాగా స్పందించారు.
Director Atlee Comment
‘ప్రతి సినిమాకు సీక్వెల్ తీసే అవకాశం ఉంటుంది. జవాన్ సీక్వెల్ గురించి ఇప్పుడే చెప్పలేను. కచ్చితంగా ప్రేక్షకులకు సర్ ప్రైజ్ ఇస్తాను. నేను ఎప్పుడూ భిన్నమైన కంటెంట్ తో ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాను. షారుక్ తో పనిచేయడం ఎప్పటికీ మర్చిపోలేను. ఆయన చాలా సరదాగా ఉంటారు. వర్క్ విషయంలో ఎక్కడా రాజీపడరు. త్వరలోనే ఆయనతో పనిచేస్తాను. ఎప్పుడు… ఎలా.. చేస్తామనే విషయం షారుక్ చేతిలోనే ఉంది. ఆయనతో కలిసి వర్క్ చేయడానికి నేను ఎప్పుడూ సిద్ధమే’ అని అట్లీ అన్నారు.
అట్లీ తెరకెక్కించిన తొలి బాలీవుడ్ చిత్రం ‘జవాన్’. యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాతో ఆయన బిజీ అయ్యారు. వరుణ్ ధావన్, కీర్తి సురేశ్ లతో ఓ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. షారుక్-విజయ్ లతో ఓ మల్టీస్టారర్ ను ప్రకటించారు. వీటితో పాటు కోలీవుడ్ హీరో అజిత్ కోసం కూడా స్క్రిప్ట్ సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. అల్లు అర్జున్‌తో కూడా ఓ ప్రాజెక్ట్ లైన్‌లో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇవన్నీ పూర్తయితే తప్ప జవాన్ కు సీక్వెల్ వచ్చే అవకాశం కనిపించడం లేదు.
Also Read : Khushi Kapoor: బాలీవుడ్ లో ‘ఉప్పెన’ రీమేక్ ! హీరోయిన్ గా అతిలోక సుందరి కుమార్తె ?