Director Atlee : తనను అవమానించిన యాంకర్ కు ఇచ్చిపడేసిన అట్లీ

మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే.. టాలెంట్‌ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు...

Atlee : ‘జవాన్‌’తో బాలీవుడ్‌ పాపులర్‌ అయ్యారు కోలీవుడ్‌ దర్శకుడు అట్లీ(Atlee). ప్రస్తుతం ఆయన ‘బేబీ జాన్‌’ ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా ‘ది గ్రేట్‌ ఇండియన్‌ కపిల్‌ షో’లో పాల్గొని సినిమా విశేషాలు షేర్‌ చేశారు. ఇదిలా ఉండగా.. అట్లీ లుక్‌పై కపిల్‌ విమర్శలు చేస్తూ దర్శకుడిని అవమానించేలా వ్యవహరించాడు. ‘‘కథ చెప్పడం కోసం ఎవరినైనా స్టార్‌ హీరోను మీరు కలిసినప్పుడు.. వాళ్లు అట్లీ ఎక్కడ అని అడుగుతారా?’’ అని కపిల్‌ ప్రశ్నించాడు. అతడు ఏ ఉద్దేశంతో అలా అడిగాడో అర్థం చేసుకున్న అట్లీ(Atlee) తనదైన శైలిలో స్ర్టాంగ్‌ కౌంటర్‌ ఇచ్చారు. ‘‘మీరెందుకు ఈ ప్రశ్న నన్ను అడుగుతున్నారు నాకు అర్థమైంది.

మీ ప్రశ్నకు నా సమాధానం ఒక్కటే.. టాలెంట్‌ ఉన్నప్పుడు మనం ఎలా ఉన్నామనేది పెద్ద విషయం కాదు. నిజం చెప్పాలంటే, దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌కు నేను కృతజ్ఞతతలు చెప్పాలి. తొలిసారి ఒక కథతో ఆయన వద్దకు వెళ్లినప్పుడు.. ఆయన కేవలం నా స్ర్కిప్ట్‌ గురించే ఆలోచించారు తప్ప నా లుక్‌ ఎలా ఉందనేది చూడలేదు. నా కథపై నమ్మకం ఉంచి నా తొలి చిత్రానికి నిర్మాతగా చేశారు. కాబట్టి, ప్రపంచం కూడా మన వర్క్‌నే చూడాలి. రూపాన్ని బట్టి మనల్ని అంచనా వేయకూడదు. మనిషి ఎలా ఉన్నాడనే కాకుండా హృదయంతో చూడండి’’ అని అట్లీ సమాధానం ఇచ్చారు.

Director Atlee Comments

ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. కపిల్‌ తీరును నెటిజన్లు తప్పుపడుతున్నారు. షోకు ఆహ్వానించి ఈ విధంగా అవమానించడం బాలేదని మండిపడుతున్నారు. ఇకపై ఇలాంటివి జరగకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు. వరుణ్‌ ధావన్‌, కీర్తి సురేశ్‌ జంటగా నటించిన చిత్రం ‘బేబీ జాన్‌’. కాలీస్‌ దీన్ని తెరకెక్కిస్తున్నారు. వామికా గబ్బీ, జాకీష్రాఫ్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. అట్లీ కథ అందించారు. కోలీవుడ్‌లో విజయాన్ని అందుకున్న ‘తెరీ’ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కిందని సమాచారం. క్రిస్మస్‌ కానుకగా డిసెంబర్‌ 20న ఈ సినిమా విడుదల కానుంది.

Also Read : Mohan Babu : తన వద్ద ఉన్న లైసెన్స్డ్ గన్ ను పోలీసులకు అప్పగించిన మోహన్ బాబు

atleeCommentsUpdatesViral
Comments (0)
Add Comment