Director AS Ravikumar : టాలీవుడ్ లో డైరెక్టర్ల తీరుపై తీవ్ర విమర్శలు నెలకొన్న తరుణంలో ఉన్నట్టుండి ఓ డైరెక్టర్ హద్దులు దాటి ప్రవర్తించడం చర్చనీయాంశంగా మారింది. హీరోయిన్ మన్నార్ చోప్రాకు సినిమా ప్రమోషన్ సందర్బంగా అందరూ చూస్తూ ఉండగానే ముద్దు పెట్టారు దర్శకుడు ఏఎస్ రవికుమార్ చౌదరి.
Director AS Ravikumar Viral
మనార్ చోప్రా ఎవరో కాదు ప్రముఖ బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాకు కజిన్ అవుతుంది. మనార్ చోప్రా తిరగబడరా సామి సినిమాలో నటించింది. ఈ మూవీ ప్రమోషన్ కార్యక్రమంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మనార్ చోప్రా అడగకుండానే దర్శకుడు(Director AS Ravikumar) ఆమె చెంపల మీద గట్టిగా ముద్దు పెట్టాడు. దీంతో ఆమె కొంత అసౌకర్యానికి లోనైంది. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో సోషల్ మీడియాను షేక్ చేశారు. టాలీవుడ్ దర్శకుడి తీరుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది.
ఇటీవలే డార్లింగ్ ప్రభాస్ , కృతీ సనన్ కలిసి నటించిన ఓం రౌత్ మూవీ సందర్భంగా దర్శకుడు ఓం రౌత్ తిరుమల ఆవరణలో సనన్ కు బహిరంగంగా ముద్దు పెట్టారు. ఇది తీవ్ర విమర్శలకు దారి తీసింది. పవిత్ర పుణ్య స్థలంలో ఇలాంటివి ఎలా చేస్తారంటూ భక్తులు ప్రశ్నించారు. మొత్తంగా ఏఎస్ రవికుమార్ చౌదరి చేసిన పనికి మనార్ చోప్రాతో పాటు ఫ్యాన్స్ భగ్గుమంటున్నారు.
Also Read : Naa Saami Ranga : నాగార్జున నా సామి రంగ