Chiranjeevi : మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం విశ్వంభర మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. త్వరలోనే మరో మూవీకి ఓకే చెప్పినట్లు టాలీవుడ్ లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తను నటించబోయే ఆ సినిమాకు సంబంధించి కథ కూడా దర్శకుడు చెప్పినట్లు ఇందుకు మైత్రీ మూవీ మేకర్స్ సైతం అగ్రిమెంట్ కుదుర్చుకున్నట్లు కూడా టాక్. ఇది పక్కన పెడితే ఆ డైరెక్టర్ ఎవరో కాదు బాబీ.
Chiranjeevi-Bobby Movie..
చిత్ర పరిశ్రమలో మినిమం గ్యారెంటీ ఉన్న డైరెక్టర్లు కొందరున్నారు. వారిలో హ్యాట్రిక్ మూవీస్ తీసిన అనిల్ రావిపూడి కాగా మరొకరు బాబీ. తను ఇటీవలే నందమూరి నట సింహ బాలకృష్ణ, ఊర్వశి రౌటేలా, శ్రద్దా త్రినాథ్ , ప్రగ్యా జైశ్వాల్ తో డాకు మహారాజ్ మూవీ తీశాడు. ఇది బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సంక్రాంతి పర్వదినం సందర్బంగా ఇది విడుదలైంది. దీంతో పాటు రిలీజ్ అయిన రెండు సినిమాలలో ఒకటి గేమ్ ఛేంజర్ కాగా మరొకటి సంక్రాంతికి వస్తున్నాం.
బాబీ మూవీ కంటే అనిల్ రావిపూడి వెంకీ మామతో తీసిన చిత్రం భారీ వసూళ్లు సాధించింది. వరల్డ్ వైడ్ గా రూ. 300 కోట్ల మార్క్ కు దగ్గరగా ఉంది. ఇది పక్కన పెడితే చిరంజీవి(Chiranjeevi)తో గతంలో బాబీ బ్లాక్ బస్టర్ మూవీ తీశాడు. అదే వాల్తేరు వీరయ్య. ఇప్పుడు చిరంజీవితో చర్చలు జరిపాడని, కథ కూడా ఓకే చేయించుకున్నట్లు సమాచారం. మొత్తం విశ్వంభర అయ్యాక, అనిల్ రావిపూడి సినిమా అనంతరం బాబీకి మెగాస్టార్ తో సినిమా తీసే ఛాన్స్ దక్కనుంది మరోసారి.
Also Read : Suryapet Junction- Shocking Updates : సూర్య పేట్ జంక్షన్ ట్రైలర్ రిలీజ్