Buchi Babu Shocking :క‌సితో తీస్తున్నా సినిమా స‌క్సెస్ ప‌క్కా

ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న బోల్డ్ కామెంట్..

Buchi Babu : డైన‌మిక్ డైరెక్ట‌ర్ సుకుమార్ శిష్యుడు ఒకే ఒక్క సినిమాతో రికార్డ్ బ్రేక్ చేసిన ద‌ర్శ‌కుడు బుచ్చిబాబు స‌న‌(Buchi Babu). తాను గ్లోబ‌ల్ స్టార్ హీరో మెగా ఫ్యామిలీకి చెందిన రామ్ చ‌ర‌ణ్ తేజతో క‌లిసి భారీ ప్రాజెక్టుతో సినిమా తీస్తున్నాడు. ప్ర‌స్తుతం క‌ర్ణాట‌క‌లో శ‌ర వేగంగా షూటింగ్ కొన‌సాగుతోంది. దీనికి ఆర్సీ16 మూవీ అని పేరు పెట్టారు. ఇటీవ‌లే సెట్స్ పైకి వెళ్లింది. ఈ సినిమా గురించి కీల‌క అప్ డేట్ ఇచ్చారు మూవీ మేక‌ర్స్.

Director Buchi Babu Shocking Comment

తాను ఉప్పెన విడుద‌ల చేసిన‌ప్పుడు అంద‌రూ పెద‌వి విరిచార‌ని, కానీ త‌న తండ్రి సినిమా చూసి వ‌చ్చిన ప్రేక్ష‌కుల గురించి చిత్రం ఎలా ఉందంటూ అడిగార‌ని తెలిపారు. ఇదే స‌మ‌యంలో చెర్రీ మూవీకి సంబంధించి అలాంటివి అడ‌గాల్సిన అవ‌స‌రం లేద‌న్నారు.

ఈ సంద‌ర్బంగా బుచ్చిబాబు స‌న మీడియాతో మాట్లాడారు. తాను మ‌రింత ఉత్సాహంతో, ప‌ట్టుద‌ల‌తో అంత‌కంటే క‌సితో రామ్ చ‌ర‌ణ్ తేజ‌తో సినిమా తీస్తున్నాన‌ని అన్నారు. ఈ సినిమా తెలుగు చ‌ల‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో రికార్డ్ సృష్టించ‌డం ఖాయ‌మ‌ని, ఇది నా ఛాలెంజ్ అంటూ ప్ర‌క‌టించారు. ఒక ర‌కంగా బోల్డ్ స్టేట్మెంట్ ఇవ్వ‌డం విస్తు పోయేలా చేసింది.

సామాన్యంగా అంత‌ర్ముఖుడిగా ఉన్న బుచ్చిబాబు స‌న ఇలా ఉన్న‌ట్టుండి షాకింగ్ కామెంట్స్ చేయ‌డం సినీ వ‌ర్గాల‌ను సైతం విస్తు పోయేలా చేసింది. ఇదిలా ఉండ‌గా టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు బ్ర‌హ్మాజీ న‌టించిన బాపు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొన్నారు ద‌ర్శ‌కుడు.

Also Read : Hero Rishab Shetty : మ‌రాఠా యోధుడిగా రిష‌బ్ శెట్టి

buchi babu sanaCommentsShockingViral
Comments (0)
Add Comment