Popular Actress Dimple Kapadia :సినిమానే లోకం అదే ప్ర‌పంచం

67 ఏళ్ల వ‌య‌స్సు వ‌చ్చినా న‌ట‌నే

Dimple Kapadia : న‌ట‌నే నాకు ప్రాణం పోసేలా చేసింది. జీవించ‌డం చాలా సుల‌భ‌మే. కానీ న‌టించ‌కుండా ఉండ‌డం అనే ఆలోచ‌నే త‌న‌ను భ‌య‌పెట్టేలా చేస్తోందంటోంది డింపుల్ క‌పాడియా. ఇవాళ అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వం. నాలాంటి మ‌హిళ‌లు ఎంద‌రో రాణిస్తున్నారు. రంగుల లోకంలోకి వ‌స్తున్నారు. మేం న‌ట‌నా రంగంలోకి అడుగు పెట్టిన‌ప్పుడు అంత‌గా పోటీ లేదు. కానీ ఇప్పుడు టెక్నాల‌జీ మారింది. సినిమా రంగం కొత్త పుంత‌లు తొక్కుతోందంటోంది ఈ బ్యూటీ.

Dimple Kapadia Comment

ఇత‌రులు ఏమ‌ని అనుకుంటున్నార‌నే దాని గురించి నేను అస్స‌లు ప‌ట్టించుకోను. నా ప్ర‌య‌త్నం ఒక్క‌టే. చివ‌రి శ్వాస ఉన్నంత వ‌ర‌కు న‌టిస్తూనే ఉండాల‌ని, అలాగే చ‌ని పోవాల‌ని త‌న అంతిమ కోరిక అంటోంది. ఎక్క‌డైనా రాణించాలంటే ఎవ‌రినీ దేబ‌రించాల్సిన ప‌ని లేదంటోంది. ప‌ని ప‌ట్ల ఫోక‌స్ పెడితే చాలు ఏదో ఒక రోజు మ‌న‌ల్ని గుర్తించ‌డం త‌ప్ప‌ద‌న్నారు. త‌ను ఇప్ప‌టి వ‌ర‌కు 80కి పైగా సినిమాల‌లో న‌టించారు. గ‌త ఏడాది 2024 వోగ్ సంచిక‌పై ముఖ చిత్రంగా వ‌చ్చారు. ఈ సంద‌ర్బంగా కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. నేను చేసే ప‌నిని ఎక్కువ‌గా ఇష్ట ప‌డ‌తాను. అది న‌న్ను జీవిత కాలంలో ముందుకు వెళ్లేలా చేసింద‌న్నారు.

Also Read : Beauty Raveena Tandon :ర‌వీనా తుళ్లింత గుండెల్లో గిలిగింత

CommentsDimple KapadiaTrendingViral
Comments (0)
Add Comment