Dimple Hayathi: గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసిన డింపుల్‌ హయతి

గోల్డెన్‌ ఛాన్స్‌ కొట్టేసిన డింపుల్‌ హయతి

Dimple Hayathi : గల్ఫ్ సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చి… గద్దలకొండ గణేష్ లో జర్ర జర్ర ఐటెం సాంగ్ తో యువతను ఉర్రూతలూగించి… సామాన్యుడు, ఖిలాడీ, రామబాణం సినిమాలతో ప్రేక్షకులకు దగ్గరైన నటి డింపుల్ హయతి(Dimple Hayathi). ఇటీవల హైదరాబాద్ లో తను నివసిస్తున్న అపార్ట్ మెంట్ లో నివశిస్తున్న ఓ ఐపిఎస్ అధికారితో కార్ పార్కింగ్ విషయంలో గొడవ పెట్టుకుని వార్తల్లో నిలిచింది. అయితే ఆమె ఇప్పుడు ఒక్కసారిగా గోల్డెన్ ఆఫర్ కొట్టేసింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతి సినిమాలో నటించే అవకాశాన్ని చేజిక్కించుంది.

Dimple Hayathi – విజయ్ సేతుపతి ‘ట్రైన్‌’లో అవకాశం దక్కించుకున్న డింపుల్

పేసుదడి, అంజాదే, పిశాచి వంటి చిత్రాలతో తానేమిటో నిరూపించుకున్న దర్శకుడు మిష్కిన్‌ (షన్ముగరాజా) … విజయ్ సేతుపతి ప్రధాన పాత్రలో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు ఇటీవల ప్రకటించారు. వి క్రియేషన్స్ పతాకంపై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్న ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఇటీవలే చెన్నైలో ప్రారంభమయ్యాయి. ట్రైన్‌ ట్రావెలింగ్‌ ఇతివృత్తంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు ‘ట్రైన్‌’ టైటిల్‌ను ఖరారు చేసింది చిత్ర యూనిట్. విజయ్‌సేతుపతి సరికొత్త గెటప్‌లో కనిపించబోయే ఈ సినిమా కోసం దర్శకుడు మిస్కిన్ ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో విజయ్ సేతుపతి సరసన డింపుల్‌ హయతి చాలా ముఖ్యపాత్రను పోషిస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. వీరితో పాటు ఈరా దయానంద్, నాజర్, భావన, బట్లు పృథీరాజా, కేఎస్‌ రవికుమార్, రూడీసేతు, గణేష్‌ వెంకట్రామన్, కనిహా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. దర్శకుడు మిష్కిన్‌నే సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రానికి పాసియా పాతిమా ఛాయాగ్రహణం అందిస్తున్నారు. దీనితో డింపుల్ నక్కతోక తొక్కినట్లే అంటూ నెటిజన్లు ఆమెను ప్రశంసిస్తున్నారు.

నటుడిగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా… మిష్కిన్

2002లో యూత్ అనే తమిళ సినిమాతో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కోలీవుడ్ లో అడుగుపెట్టిన మిష్కిన్… 2006లో ఛితిరం పేసుతడి సినిమాతో డైరెక్టర్ గా మారి తొలి సినిమాతోనే మంచి విజయం అందుకున్నారు. ఆ తరువాత కోలీవుడ్ లో నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, స్క్రీన్ రైటర్ గా, దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న మిష్కిన్ ఇటీవల డెవిల్‌ అనే చిత్రం ద్వారా సంగీత దర్శకుడిగా మారారు. మిష్కిన్‌ తాజాగా దర్శకత్వం వహించిన పిశాచి 2 చిత్రం త్వరలో తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న నటుడు విజయ్‌ సేతుపతి కథానాయకుడిగా నటించిన 50వ చిత్రం మహారాజా కూడా రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వీరి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ట్రైన్‌’ సినిమాపై అభిమానుల్లో ఆశక్తి నెలకొంది.

Also Read : Vithika Sheru: సిక్స్ ప్యాక్ తో అలరిస్తున్న టాలీవుడ్ బ్యూటీ

Dimple HayathiVijay Sethupathi
Comments (0)
Add Comment