Dilruba – Court Movies Sensational :14న ప‌లు సినిమాలు రిలీజ్

నువ్వా నేనా అంటున్న మూవీస్

Dilruba : తెలుగు మూవీ ఇండ‌స్ట్రీలో పోటీ పెరిగింది. క‌థ‌ల‌కు ప్రాధాన్య‌త ఉండే సినిమాల‌ను ఎక్కువ‌గా ఆద‌రిస్తున్నారు ప్రేక్ష‌కులు. దీంతో గ‌తంలో హీరోల‌కు ప్ర‌యారిటీ ఉండే మూవీస్ కు ఆద‌ర‌ణ ఉండేది. సీన్ మారింది. కొత్త కొత్త ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో సినిమాలు తీస్తున్నారు. ఈ సంద‌ర్బంగా కాంపిటీష‌న్ కు త‌గ్గ‌ట్లుగా మూవీస్ ఈసారి ప్రేక్ష‌కుల ముందుకు రాబోతున్నాయి. ఇందులో భాగంగా మార్చి 14న ప‌లు సినిమాలు విడుద‌ల కానుండ‌డంతో ఫ్యాన్స్ ఎంతో ఉత్కంఠ‌తో ఎదురు చూస్తున్నారు.

Dilruba – Court Movies Releases on 14th March

విచిత్రం ఏమిటంటే గ‌త వారంలో 14 మూవీస్ రిలీజ్ అయ్యాయి. వీటిలో బాలీవుడ్ లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి రూ. 500 కోట్ల క్ల‌బ్ లోకి చేరిన ఉటేక‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన విక్కీ కౌశ‌ల్, నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్నా క‌లిసి న‌టించిన ఛావా హిందీ మూవీ. దీనిని తెలుగు వెర్ష‌న్ ను శుక్ర‌వారం విడుద‌లైంది. ఈవారంలో కిర‌ణ్ అబ్బ‌వ‌రం(Kiran Abbavaram) న‌టించిన దిల్ రుబా(Dilruba). ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన పోస్ట‌ర్స్, టీజ‌ర్, ట్రైల‌ర్ కెవ్వు కేక అనిపించేలా ఉంది. ఇందులో రుక్స‌ర్ థిల్లాన్ హీరోయిన్ పాత్ర పోషించింది. దీనిని విశ్వ క‌రుణ్ తీశాడు. క చిత్రం త‌ర్వాత వ‌స్తున్న మూవీ కావ‌డంతో ప్రేక్ష‌కుల్లో, ఫ్యాన్స్ లో మ‌రింత ఉత్కంఠ రేపుతోంది.

నేచుర‌ల్ స్టార్ నాని నిర్మించిన చిత్రం కోర్ట్. ఇది కూడా 14నే రానుంది. ఇందులో ప్రియ‌ద‌ర్శి, శివాజీ, రోహిణి, హ‌ర్ష రోశ‌న్, శ్రీ‌దేవి , త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషించారు. ఈ చిత్రం పూర్తిగా పోక్సో చ‌ట్టం అంశం ఆధారంగా తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశాడు ద‌ర్శ‌కుడు. కంటెంట్ ప‌రంగా మంచి ఆద‌ర‌ణ చూర‌గొంది ఈ మూవీ. ఈ సంద‌ర్బంగా సంచ‌ల‌న కామెంట్స్ చేశాడు నాని. ఈ చిత్రం న‌చ్చ‌క పోతే తాను న‌టించిన హిట్ 3 మూవీ చూడొద్దంటూ ప్ర‌క‌టించాడు. మ‌రో వైపు ఇదే రోజున మ‌ల‌యాళంలో సూప‌ర్ డూప‌ర్ హిట్ అయిన సినిమా థ్రిల్ల‌ర్ ఆఫీస‌ర్ ఆన్ డ్యూటీ. కుంచ‌కో బోబ‌న్, ప్రియ‌మ‌ణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. 2010లో సూప‌ర్ డూప‌ర్ హిట్ గా నిలిచిన యుగానికి ఒక్క‌డు చిత్రం కూడా ఇదే రోజు రానుంది.

Also Read : Popular Actress Sridevi Role :శ్రీ‌దేవి పాత్ర‌లో కూతురు ఖుషీ క‌పూర్

CourtDil RubaMoviesTrendingUpdates
Comments (0)
Add Comment