Cloud Puller-Diljit : దిల్జిత్ దోసాంజ్ పంజాబ్ 95 రిలీజ్ వాయిదా

ప్ర‌క‌టించిన పంజాబ్ పాప్ సింగ‌ర్

Diljit  : పంజాబ్ కు చెందిన దిల్జిత్ దోసాంజ్ ప్ర‌పంచ పాప్ సింగ‌ర్ల‌లో ఒక‌డిగా గుర్తింపు పొందాడు. అత్యంత జ‌నాద‌ర‌ణ పొందిన పాట‌ల‌ను పాడాడు. త‌ను న‌టించిన పంజాబ్ 95 చిత్రం గురించి ఆస‌క్తిక‌ర అప్ డేట్ ఇచ్చాడు.

వ‌చ్చే నెల ఫిబ్ర‌వ‌రి 7న ముందుగా విడుద‌ల చేయాల‌ని ప్ర‌క‌టించారు మూవీ మేక‌ర్స్. కానీ ఉన్న‌ట్టుండి చిత్రాన్ని విడుద‌ల చేయ‌డం సాధ్యం కాద‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా సిక్కు కార్యకర్త జస్వంత్ సింగ్ ఖల్రా జీవితం ఆధారంగా 1995కు సంబంధించి క‌థ‌ను తెర‌కెక్కించే ప్ర‌య‌త్నం చేశారు.

Cloud Puller Diljit dosanjh Comment

కాగా సినిమాకు సంబంధించి భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. సినిమా వాయిదా వేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల చాలా బాధ‌గా ఉంద‌న్నాడు దిల్జిత్ దోసాంజ్(Diljit). హనీ ట్రెహాన్ దర్శకత్వం వహించారు పంజాబ్ 95ను. ఇక‌ రోనీ స్క్రూవాలా నిర్మించారు ఈ మూవీని.

పంజాబ్ ఉగ్రవాద యుగంలో మానవ హక్కుల ఉల్లంఘనలను వెలికి తీసినందుకు ప్రసిద్ధి చెందిన ఖల్రా కథను చెబుతుంది. ఈ చిత్రంలో దిల్జిత్ దోసాంజ్ తదుపరి బోర్డర్ 2లో కనిపిస్తారు. ఈ చిత్రంలో అహన్ శెట్టి, సన్నీ డియోల్, వరుణ్ ధావన్ ప్రధాన పాత్రల్లో నటించారు.

అనురాగ్ సింగ్ దర్శకత్వం వహించిన బోర్డర్ 2, సన్నీ డియోల్ తన పురాణ పాత్ర అయిన వరుణ్ ధావన్, దిల్జిత్ దోసాంజ్ , అహన్ శెట్టిలతో కూడిన స్టార్-స్టడెడ్ సమిష్టి తారాగణంతో ఒక గొప్ప సినిమా దృశ్యం కానుంది.

Also Read : Hero Bunny-Pushpa 2 : పుష్ప‌-2 రికార్డ్..రూ.1,830 కోట్లు వ‌సూలు

CinemaDiljit DosanjahUpdatesViral
Comments (0)
Add Comment