Dil Raju : అమెరికా నుంచి వచ్చిన నిర్మాత దిల్ రాజు శ్రీ తేజ్ ను పరామర్శించారు

సమస్యను పరిష్కరించేందుకు FDC ఛైర్మన్‌గా బాధ్యత తీసుకుంటా అని అన్నారు...

Dil Raju : ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు సంధ్య థియేటర్ ఘటనలో గాయపడిన శ్రీతేజ్‌ను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. శ్రీతేజ్ కుటుంబానికి అండగా ఉంటాం అని హామీ ఇచ్చారు. శ్రీతేజ్ రికవరీ అవుతున్నాడని తెలిపాడు. రేవతి మరణం పట్ల బాధను వ్యక్త పరిచారు. కావాలని ఎవరు ఇలాంటి ఘటనలకు పాల్పడరని తెలిపారు. అలాగే రేవతి కుటుంబం కూడా వినోదం కోసమే థియేటర్‌కు వెళ్లారు అన్నారు. రేపు లేదా ఎల్లుండి సీఎం రేవంత్‌ను కలుస్తామని చెప్పారు. సమస్యను పరిష్కరించేందుకు FDC ఛైర్మన్‌గా బాధ్యత తీసుకుంటా అని అన్నారు.

Dil Raju Meet…

ఇటీవల తెలుగు సినిమా పరిశ్రమను మరింత పెద్దదిగా చేయటమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి ఆలోచనలు ఉన్నాయని దిల్ రాజు(Dil Raju) చెప్పుకొచ్చారు. నిజానికి 2014లోనే టాలీవుడ్ అభివృద్ధికి భూములు ఇస్తామని గత ప్రభుత్వం ప్రకటించినా..‌ దశాబ్ద కాలంలో చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. కానీ గతేడాది సీఎం రేవంత్ రాకతో ఆగిపోయిన నంది అవార్డులను గద్దర్ అవార్డుల పేరుతో తిరిగి ప్రారంభిస్తామని రేవంత్ హామీ ఇచ్చారు.‌ ‌వచ్చే ఏడాది నుంచి గద్దర్ అవార్డుల ప్రధానోత్సవం ఉంటుందని.. కమిటీతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటామని ఈ సందర్భంగా దిల్ రాజు ప్రకటించారు.

Also Read : Vijay Deverakonda : మరోసారి కెమెరా కంటపడ్డ విజయ్, రష్మిక

dil rajuMeetSandhya TheatreUpdatesViral
Comments (0)
Add Comment