Dil Raju- Shocking Comment:స్టార్ హీరోలపై దిల్ రాజు షాకింగ్ కామెంట్స్

ఏడాదికి ఒక్క సినిమా అయినా చేస్తే మంచిది..

Dil Raju : ప్ర‌ముఖ నిర్మాత దిల్ రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న స్టార్ హీరోల గురించి మాట్లాడారు. ఏళ్ల త‌ర‌బ‌డి కాకుండా సంవ‌త్స‌రానికి ఒక్క సినిమా అయినా చేయాల‌ని అభిప్రాయం వ్య‌క్తం చేశారు. లేక పోతే సినిమా రంగానికి ఇబ్బందులు ఏర్ప‌డ‌తాయ‌న్నారు. వాళ్ల మీద ఆధార‌ప‌డిన వాళ్లు ఎంద‌రో ఉంటార‌ని, ప్ర‌త్య‌క్షంగా ప‌రోక్షంగా కొంద‌రికి ఉపాధి ద‌క్కుతుంద‌న్న విష‌యం గుర్తించాల‌న్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న చేసిన కామెంట్స్ టాలీవుడ్ లో క‌ల‌క‌లం రేపాయి. త‌ను తెలంగాణ ఫిలిం డెవ‌ల‌ప్మెంట్ కార్పొరేష‌న్ చైర్మ‌న్ గా కూడా ఉన్నారు.

Dil Raju Shocking Comments on Star Heros

విచిత్రం ఏమిటంటే ఈ కొత్త ఏడాది దిల్ రాజు(Dil Raju)కు మిశ్ర‌మ ఫ‌లితాలు వ‌చ్చాయి. త‌ను రెండు సినిమాల‌ను నిర్మించాడు. వీటిని సంక్రాంతి పండుగ సంద‌ర్బంగా విడుద‌ల చేశాడు వ‌ర‌ల్డ్ వైడ్ గా. త‌న‌కు ఓ సెంటిమెంట్ ఉంది. ప్ర‌తి ఏటా ఫెస్టివ‌ల్ రోజు రిలీజ్ చేయ‌డం. గ‌తంలో త‌ను తీసిన చాలా సినిమాలు బిగ్ హిట్ అయ్యాయి.

తాజాగా మెగాస్టార్ త‌న‌యుడు రామ్ చ‌ర‌ణ్ తేజ‌తో శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో గేమ్ చేంజ‌ర్ రిలీజ్ చేశాడు. ఇది అట్ట‌ర్ ప్లాప్ గా నిలిచింది. భారీ పెట్టుబ‌డి పెట్టాడు దిల్ రాజు. తీవ్రంగా న‌ష్ట పోయాడు. మెగా ఫ్యామిలీ దెబ్బ‌కు ఠారెత్తి పోయాడు. ఇదే స‌మ‌యంలో ఎలాంటి అంచ‌నాలు లేకుండానే త‌ను నిర్మించిన మ‌రో మూవీ అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో వెంకీ మామ‌తో తీసిన సంక్రాంతికి వ‌స్తున్నాం బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. ఇది ఆయ‌న‌కు కొంత న‌ష్టాన్ని పూడ్చేలా చేసింది. లేక పోతే పీక‌ల లోతు అప్పుల్లోకి కూరుకు పోయి ఉండేవాడు.

ఇదే స‌మ‌యంలో ఇటీవ‌లే ఐటీ ప‌న్ను క‌ట్ట‌లేదంటూ కొంద‌రిపై దాడులు చేసింది. ఇందులో దిల్ రాజు కూడా ఉన్నారు.

Also Read : Hero Chiranjeevi-Bobby : మెగాస్టార్ తో బాబీ మ‌రో మూవీ

Commentsdil rajuShockingViral
Comments (0)
Add Comment