Dil Raju: సైబర్ నేరాలు, డ్రగ్స్ కట్టడిపై తెలుగు చలన చిత్ర పరిశ్రమ అవగాహన కల్పించాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచనపై తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి స్పందించింది. డ్రగ్స్, సైబర్ నేరాలను అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా చలన చిత్ర పరిశ్రమ… ప్రభుత్వానికి అండగా ఉంటుందని టీఎఫ్‌సీసీ అధ్యక్షుడు దిల్ రాజు, కార్యదర్శులు కె.ఎల్.దామోదర ప్రసాద్, కె.శివప్రసాదరావు ఒక ప్రకటనలో తెలిపారు.
Dil Raju Respond
‘‘ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసినప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన విషయాలపై సానుకూలంగా స్పందించారు. ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ… సమాజాన్ని పట్టి పీడిస్తున్న డ్రగ్స్, సైబర్ నేరాల నియంత్రణపై సినీ రంగ ప్రముఖలు, సినిమా థియేటర్ యాజమాన్యాలు తమ వంతుగా కృషి చేయాలన్నారు. ఇలాంటి విషయాల్లో గతంలోనూ చిత్ర పరిశ్రమ ముందుండి ప్రభుత్వానికి అండగా నిలబడింది. చలన చిత్ర పరిశ్రమకు సంబంధించిన నటులు, దర్శకులు, నిర్మాతలు, పంపిణీదారులు, థియేటర్ల యాజమాన్యాలు.. డ్రగ్స్, సైబర్ నేరాలు అరికట్టే విషయంలో తమ వంతు బాధ్యతగా వ్యవహరిస్తాయి. ప్రభుత్వానికి అండగా ఉంటామని తెలియజేస్తున్నాం. దీనిపై త్వరలోనే సీఎం రేవంత్‌రెడ్డిని కలుస్తాం’’ అని పేర్కొన్నారు.
Also Read : Salaar: జపాన్ లో విడుదలకు సిద్ధమైన సలార్, జవాన్ !