Dil Raju : శనివారం రాజమహేంద్రవరంలో గేమ్ చేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగిన సంగతి తెలిసిందే. ఆ వేడుకలో పాల్గొని తిరిగి ఇళ్లకు వెళుతున్న క్రమంలో కాకినాడ జిల్లా గైగోలుపాడుకు చెందిన ఆరవ మణికంఠ (23), తోకాడ చరణ్(22) ప్రమాదవశాత్తు మరణించారు.
Dil Raju Helps
ఈ ఘటన గురించి తెలిసిన వెంటనే నిర్మాత దిల్‌రాజు మీడియా సమక్షంలో వెంటనే స్పందించారు. ఆయన మాట్లాడుతూ ‘‘‘గేమ్ చేంజర్’ ప్రీ రిలీజ్ ఈవెంట్ చాలా ఘనంగా జరిగింది. ఆ విషయంపై మేం సంతోషంగా ఉన్న సమయంలో ఇలా ఇద్దరు అభిమానులు తిరుగు ప్రయాణంలో జరిగిన ప్రమాదంలో చనిపోవటం ఎంతో బాధాకరం. వారి కుటుంబాలకు నేను అండగా ఉంటాను. నా వంతుగా వారి కుటుంబాలకు చెరో రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నాను. ఇలాంటి ఘటన జరిగినప్పుడు కుటుంబాల్లో ఎంత బాధ ఉంటుందో అర్థం చేసుకోగలను. వారికి నా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తున్నాను’’ అని అన్నారు.
Also Read : Kichcha Sudeep : పేదలకు విద్య, వైద్యం కోసం ఓ కొత్త పనికి శ్రీకారం చుట్టిన కన్నడ స్టార్