Dil Raju Dance: ఘనంగా టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి !

ఘనంగా టాలీవుడ్ యంగ్ హీరో పెళ్లి !

Dil Raju Dance: టాలీవుడ్ యంగ్ హీరో, నిర్మాత దిల్ రాజు మేనల్లుడు ఆశిష్ రెడ్డి వివాహా బంధంలోకి అడుగుపెట్టారు. ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డి మెడలో మూడు ముళ్ళు వేసి తన బ్యాచిలర్ లైఫ్ కు చెక్ పెట్టారు. రాజస్థాన్‌ లోని జైపూర్‌ లో నిర్వహించిన డెస్టినేషన్ వెడ్డింగ్ లో బంధువులు, సన్నిహితుల సమక్షంలో ఏడు అడుగులు వేసి కొత్త లైఫ్ ను ప్రారంభించారు. ఈ వివాహా వేడుకలో టాలీవుడ్ ప్రముఖులు, సినీ తారలు పాల్గొన్నారు. ఈ డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ లో నిర్మాత దిల్‌ రాజు(Dil Raju) డప్పు వాయిస్తూ సందడి చేశారు. ఈ వివాహానికి మెగాస్టార్‌ చిరంజీవి కుమార్తెలు శ్రీజ, సుస్మితలతో పాటు పలువురి సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు.

Dil Raju Dance Viral

దిల్ రాజు మేనల్లుడైన ఆశిష్ రెడ్డికి, ఆంధ్రప్రదేశ్‌ కు చెందిన వ్యాపారవేత్త కూతురు అద్వైత రెడ్డితో గతేడాది డిసెంబరులో ఎంగేజ్‌మెంట్‌ జరిగింది. ఈ వేడుక ఇరువురి కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితుల సమక్షంలో జరిగింది. రౌడీ బాయ్స్‌ సినిమాతో టాలీవుడ్‌ లో ఆశిష్ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమాలో ఆశిష్ సరసన అనుపమ పరమేశ్వరన్‌ హీరోయిన్‌గా నటించింది. 2022 జనవరిలో రిలీజైన ఈ చిత్రం మిక్స్‌డ్‌ టాక్‌ను సొంతం చేసుకుంది. దీనితో కాస్తా గ్యాప్ తీసుకున్న ఆశిష్ రెడ్డి ప్రస్తుతం విశాల్ కాశీ దర్శకత్వంలో సెల్ఫీష్ అనే చిత్రంలో నటిస్తున్నారు.

Also Read : Megastar : షూటింగ్ స్పీడ్ పెంచిన చిరు..తన సినిమా కోసమే అనుకుంటున్న హరీష్

Ashish Reddydil raju
Comments (0)
Add Comment