Dil Raju: ‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదలపై నిర్మాత దిల్‌ రాజు క్లారిటీ !

‘గేమ్‌ ఛేంజర్‌’ విడుదలపై నిర్మాత దిల్‌ రాజు క్లారిటీ !

Dil Raju: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కతోన్న పాన్ ఇండియా మూవీ ‘గేమ్ ఛేంజర్’. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ నటిస్తోంది. ఎస్.జె. సూర్య ప్రతినాయకుడిగా కనిపించబోతున్న ఈ సినిమాలో శ్రీకాంత్, అంజలి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీకి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఆర్ఆర్ఆర్ వంటి గ్లోబల్ బ్లాక్ బస్టర్ తరువాత రామ్ చరణ్ సోలోగా చేస్తోన్న ఈ పాన్ ఇండియా మూవీపై ఎక్స్ పెక్టేషన్స్ హై ఎండ్ లో ఉన్నాయి. కార్తిక్ సుబ్బరాజు అందించిన కథకు అత్యాధునిక సాంకేతిక విలువలు జోడించి దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా పొలిటికల్ థ్రిల్లర్ జోనర్ లో ఉన్నట్లు తెలుస్తోంది. దీనితో మెగా అభిమానులు ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న సినిమా విడుదలపై ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తుంది.

Dil Raju Comment

పొలిటికల్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందుతోన్న ఈ సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకొని నిర్మాణానంతర పనుల్లో ఉంది. ఈ సినిమా విడుదల తేదీ వాయిదా పడిందని, వచ్చే ఏడాదిలో విడుదలయ్యే అవకాశాలున్నాయని ఇటీవల ప్రచారం జరిగిన సంగతి తెలిసిందే. దీనితో ఈ సినిమా వచ్చే ఏడాదికి వాయిదా పడుతుందని వస్తున్న వార్తలకు చెక్‌ పెట్టారు నిర్మాత దిల్‌ రాజు. అవన్నీ రూమర్లేనని ‘మాస్కో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌’ లో పాల్గొన్న దిల్‌ రాజు(Dil Raju) స్పష్టం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ గేమ్ ఛేంజర్ వాయిదా పడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ముందు ప్రకటించినట్లు ఈ ఏడాది క్రిస్మస్‌కే సినిమా విడుదలవుతుందని వెల్లడించారు.

‘‘సినిమా షూటింగ్‌ పూర్తయింది. రామ్‌ చరణ్‌, శంకర్‌ ఇమేజ్‌ ను ఈ సినిమా మారుస్తుంది. మంచి విజయం అందుకుంటుంది. పొలికల్‌, యాక్షన్‌ నేపథ్యంలో సాగే పవర్‌ఫుల్‌ కథాంశంతో ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శంకర్‌ గతంలో ఇలాంటి సినిమాలు చాలా చేశారు. ‘రోబో’తో ఆయన రూట్‌ మార్చుకున్నారు’’ అని దిల్‌ రాజు అన్నారు.

Also Read : Samantha: పికిల్ బాల్ ప్లేయర్‌ గా మారిన సమంత !

dil rajugame changerGlobal Star Ram Charan
Comments (0)
Add Comment