Pushpa 2 : ప్రస్తుతం ఏ మాధ్యమంలో చూసినా పుష్ప హవానే నడుస్తోంది. ఎక్కడ చూసిన ట్రైలర్‌లోని అంశాల గురించే మాట్లాడుకుంటున్నారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ‘పుష్ప 2: ది రూల్(Pushpa 2)’ ట్రైలర్ వాటిని అందుకొని మంచి వ్యూస్‌తో ట్రెండ్ అవుతోంది. ఈ చిత్రం ట్రైలర్‌పై సినీ ప్రముఖులు ప్రశంసిస్తున్నారు. ‘ఇది నిజంగానే వైల్డ్ ఫైర్’ అంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. అందరికీ పేరుపేరునా అల్లు అర్జున్ థ్యాంక్స్ చెబుతున్నారు. తాజాగా రాజమౌళి కూడా స్పందించారు.
Pushpa 2 Trailer Updates
“పట్నాలోవైల్డ్‌ఫైర్ మొదలైంది.. అది దేశమంతటా విస్తరిస్తోంది. డిసెంబర్ 5న చెలరేగుతోంది. పార్టీ కోసం వేచి ఉండలేకపోతున్నా పుష్ప’’ అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.
“ప్రతిఫ్రేమ్‌లో చిత్ర బృందం కృషి కనిపిస్తోంది. పుష్పరాజ్ పాత్రలో అల్లు అర్జున్ తపన కనపడుతోంది. మీరు దీనికోసం పడిన కష్టం. మీ శ్రమ.. దీని కోసం వెచ్చించిన సమయం అన్నీ సినిమాపై మీకున్న ప్రేమకు స్పష్టమైన సాక్ష్యాలు.. హ్యాట్సాఫ్ డియర్ అల్లు అర్జున్’’ – హరీశ్ శంకర్ ట్వీట్ చేశారు.
“ఇప్పుడుచెప్పండ్రా అబ్బాయిలు.. నేషనల్ అనుకుంటారా, ఇంటర్నేషనల్ అనుకుంటారా”.. – దర్శకుడు బుచ్చిబాబు ట్వీట్ చేశారు.
“ట్రైలర్‌లోనిమాస్ ఎలిమెంట్స్ అదిరిపోయాయి. మరో బ్లాక్‌బస్టర్ సిద్థమవుతోంది. చిత్ర బృందానికి అభినందనలు” – రిషబ్‌శెట్టి ట్వీట్ చేశారు.
“ఇదినిజంగానే వైల్డ్‌ఫైర్. అల్లు అర్జున్, సుకుమార్ మరోసారి మేజిక్ చేయడానికి సిద్థమయ్యారు. ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్. బిగ్ స్క్రీన్ పై సినిమా చూసేందుకు వేచిచూస్తున్నా” -అనిల్ రావిపూడి ట్వీట్ చేశారు.
‘పుష్ప2’ట్రైలర్ బ్లాక్‌బస్టర్. ఐకాన్‌స్ట్టార్ ఈ చిత్రం కోసం ఎంత కష్టపడ్డారో తెలుస్తోంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ సుకుమార్ సర్ ప్రతిభ కనపడుతోంది. టీమ్‌కు బెస్ట్ విషెస్” -దర్శకుడు బాబీ ట్వీట్ చేశారు.
“తిరుగుబాటునువిప్లవంగా మార్చిన వ్యక్తి తిరిగి వచ్చాడు. అప్పటికంటే ఎక్కువ బిగ్గరగా, ఉగ్రంగా, ఘోరంగా ఉన్నాడు. ఈ పవర్‌హౌస్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. డిసెంబర్ 5 కోసం ఎదురుచూస్తున్నా” – ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.
Also Read : Pushpa 2 Trailer : పాన్ ఇండియా స్థాయిలో దూసుకుపోతున్న అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ట్రైలర్