Mahesh Babu : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదుతెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా దూసుకెళ్తు వరస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. తన సినిమాలతో అత్యధిక కలెక్షన్లు ,పలు రికార్డులను తన ఖాతలో వెసుకున్నాడు. తండ్రికి తగ్గ తనయుడుగా ఇండస్ట్రీలో తనదైన శైలీలో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో వస్తున్న గుంటూరు కారం మూవీ త్వరలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
Mahesh Babu :
ఈ క్రమంలో టాలీవుడ్ లో మహేష్ బాబుకు సంబంధించిన ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెగ వైరల్ అవుతోంది. అది ఏమిటంటే? మహేష్ బాబు(Mahesh Babu ) స్టార్ హీరో అన్న విషయం తెలిసిందే. అయితే ఆయనకు చిన్ననాటి నుంచే డాక్టర్ కావలని ఉండేదంట. అలా ఇంట్లో కూడా ఎప్పుడు ఎవరు అడిగినా కూడా తాను డాక్టర్ అవుతానని చెబుతూ ఉండేవారు. మహేష్ బాబు తండ్రి కృష్ణ హీరోగా సినిమాల షూటింగ్ జరుగుతున్నప్పుడు అప్పుడప్పుడు మహేష్ బాబుని తీసుకు వెళ్తూ ఉండేవారట.అక్కడ కృష్ణ గారి మేకప్ వేసుకొని చూడడం తన తండ్రికి ఇచ్చే రెస్పెక్ట్ చూడడం చూసి బాగా నచ్చడంతో నిర్ణయాన్ని మార్చుకున్నారట. అలా మహేష్ బాబు డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడంటూ టాలీవుడ్‌లో కొందరు ముచ్చటిస్తున్నారు.
Also Read : Stomach acidity : గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా?