Dhruvanakshatram: మరోసారి ధృవ నక్షత్రం సినిమా వాయిదా

డబ్బు సర్థుబాటు చేయలేని స్టార్ డైరెక్టర్... మరోసారి ధృవ నక్షత్రం సినిమా వాయిదా

Dhruvanakshatram : కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్, స్టైలిష్ డైరెక్టర్ గౌతమ్ మీనన్ కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా ధృవ నక్షత్రం (తమిళంలో దృవనచ్చితిరం). ఎనిమిదేళ్ళ క్రితం ప్రారంభించిన ఈ సినిమా అనివార్య కారణాల వలన వాయిదా పడుతూ వస్తుంది. అయితే ఎట్టకేలకు శుక్రవారం (నవంబరు 24) ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇప్పటికే బెంగుళూర్, ఓవర్సీస్ లో ఈ సినిమా బుకింగ్స్ ఓపెన్ కూడా అయిపోయాయి. అయితే ఆర్ధిక ఇబ్బందులు కారణంగా ఈ సినిమా మరోసారి వాయిదా పడింది. ఇదే విషయాన్నిసినిమా డైరెక్టర్ గౌతమ్ మీనన్… తన సోషల్ మీడియా (ఎక్స్) ద్వారా వెల్లడించారు.

Dhruvanakshatram Updates

ధృవ నక్షత్రం సినిమా వాయిదాపై సోషల్ మీడియా వేదికగా దర్శకుడు గౌతమ్ మీనన్… మరోసారి ఎమోషనల్ అయ్యారు. ఎక్స్ వేదికగా పెట్టిన గౌతమ్ మీనన్ పోస్ట్ విషయానికి వస్తే… “సారీ, ధృవ నక్షత్రం చిత్రాన్ని ఈరోజు థియేటర్ల లోకి తీసుకు రాలేక పోయాం. మా బెస్ట్ ప్రయత్నించాం. మాకు మరో ఒకటి లేదా రెండు రోజుల సమయం కావాలి. ఆడియన్స్ కి మంచి అనుభూతి అందిస్తాం అని ఆశిస్తున్నాం” అంటూ పోస్ట్ చేసారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నప్పటికీ… శుక్రవారం ముహూర్తం ఫిక్స్ చేసారు. అయితే ఇది మరోసారి వాయిదా పడటం తో ఫ్యాన్స్ విచారం వ్యక్తం చేస్తున్నారు.

8 కోట్లు చెల్లించిన తరువాత దృవనక్షత్రం రిలీజ్ కు ఆమోదం

2017 నుండి వివిధ కారణాలతో ధృవ నక్షత్రం(Dhruvanakshatram) రిలీజ్ కు వాయిదా పడుతుండటంతో కొంతమంది మద్రాసు కోర్టు మెట్లు ఎక్కారు. ఈ నేపథ్యంలో అటువంటి సమస్యలను పరిష్కరించడానికి 8 కోట్ల రూపాయలు చెల్లించాల్సి ఉంది. దీనితో ఆ డబ్బు చెల్లించి సినిమా రిలీజ్ కు దర్శకుడు గౌతమ్ మీనన్ ప్రయత్నించారు. గౌతమ్ మీనన్ కు ఆర్ధిక సహాయం చేయడానికి కొంతమంది బయ్యర్లు ముందుకు వచ్చినప్పటికీ… పూర్తి మొత్తాన్ని చెల్లించడంలో దర్శకుడు విఫలమయ్యాడు. దీనితో దర్శకుడు గౌతమ్ మీనన్(Gautham Menon) తప్పనిసరి పరిస్థితుల్లో ఈ సినిమా మరోసారి వాయిదా వేసారు. ఇప్పటికే తన కలల ప్రాజెక్టు ధృవ నక్షత్రం కోసం యాక్టర్ గా మారి వచ్చిన రెమ్యునరేషన్ తో సినిమాను పూర్తి చేసిన గౌతమ్ మీనన్… ఈ ఆర్ధిక ఇబ్బందుల నుండి ఎలా బయటపడతాడు… సినిమాను ఎప్పుడు రిలీజ్ చేస్తాడు అనేది సస్పెన్స్ గా మారింది.

గౌతమ్ మీనన్ కలల ప్రాజెక్టు ధృవ నక్షత్రం

దర్శకుడు గౌతమ్ మీనన్(Gautham Menon) కలల ప్రాజెక్టు ధృవ నక్షత్రం. 2016లో చియాన్ విక్రమ్ తో ఈ సినిమా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అయితే వివిధ కారణాల వలన ఆ సినిమా ఎనిమిదేళ్ళుగా ఆలస్యం అవుతూ వస్తుంది. ఒండ్రాగా ఎంటర్‌టైన్‌మెంట్, కొండడువోమ్ ఎంటర్‌టైన్‌మెంట్, ఎస్కేప్ ఆర్టిస్ట్స్ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించాయి. రీతూ వర్మ, పార్తిబన్, ఐశ్వర్య రాజేష్, సిమ్రాన్, రాధిక, అర్జున్ దాస్ మరియు దివ్యదర్శిని కీలక పాత్రలు పోషించిని ఈ సినిమాకు హారిష్ జయరాజ్ సంగీతం అందిస్తున్నారు.

Also Read : Surya Sethupathi: హీరోగా ఎంట్రీ ఇస్తున్న కోలీవుడ్ స్టార్ హీరో వారసుడు

Dhruvanakshatramvikram
Comments (0)
Add Comment