Dheera Trailer : యువ నటుడు లక్ష్ చదలవాడ నటించిన ‘ధీర’ ట్రైలర్ ట్రేండింగ్

“మా దాడి నుండి రాజ్ గురుని రక్షించడానికి రథం నడిపే కృష్ణుడుతో పాటు రాముడు రావాలి’’ అనే డైలాగ్ ద్వారా ప్రధాన పాత్రలను పరిచయం చేశారు

Dheera Trailer : ‘వలయం’, ‘గ్యాంగ్‌స్టర్ గంగరాజు’ వంటి చిత్రాల్లో మాస్ హీరోగా అందరినీ ఆకట్టుకున్నాడు లక్ష్ చదరవాడ(Laksh Chadalavada). ఇక ఇప్పుడు ‘ధీర’ తో మరో మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌పై పద్మావతి చదలవాడ ఈ చిత్రాన్ని నిర్మించారు. విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్ కోసం అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Dheera Trailer Viral

ధీర గ్లింప్స్, టీజర్స్ అందరినీ ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. కాగా, ఇప్పుడు ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు మేకర్స్. విజువల్స్, డైలాగ్స్, కథానాయకుడి ఉల్లాసం, ప్రేమ కథాంశం ఈ ట్రైలర్‌కు హైలైట్‌గా నిలిచాయి. ఈ మనిషి మెదడు ఉంది చూడు అది చాల డేంజర్” అనే లైన్‌తో ట్రైలర్ ప్రారంభమవుతుంది. “మా దాడి నుండి రాజ్ గురుని రక్షించడానికి రథం నడిపే కృష్ణుడుతో పాటు రాముడు రావాలి’’ అనే డైలాగ్ ద్వారా ప్రధాన పాత్రలను పరిచయం చేశారు. ఎవరైనా ఉన్నారా? అనే డైలాగ్ తో హీరో ఎంట్రీ మొదలవుతుంది. అతని ఎత్తు 6.2. ప్రధాన పాత్రను గీసిన విధానం ఆకట్టుకుంటుంది.

Also Read : Devara Rights : భారీ ధర పలికిన ‘దేవర’ ఓవర్సీస్ రైట్స్

CommentsLatestMovieTrendingUpdatesViral
Comments (0)
Add Comment