Dhanush : తమిళంలో ధనుష్ దర్శకత్వం వహించిన చిత్రం నిలవుకు ఎన్ మేల్ ఎన్నడి కోపమ్ . దీనిని తెలుగులో జాబిలమ్మ నీకు అంత కోపమా అనే పేరుతో విడుదలైంది. దర్శకుడిగా తన కెరీర్ లో ఇది మూడో ప్రయత్నం. ఆశించిన మేర ఆకట్టుకోలేదని చెప్పక తప్పదు. యువ తారాగణంతో దర్శకుడు రూపొందించారు. ప్రధానంగా రొమాంటిక్ , కామెడీని పండించేందుకు ప్రయత్నం చేశాడు.
Dhanush Direction Movie
కథ పరంగా చూస్తే మధ్యతరగతి యువకుడైన ప్రభు (పవిష్ నారాయణన్ ) చెఫ్ కావాలని కలలు కంటాడు. తనకు ధనవంతురాలైన స్నేహితురాలు నీలా (అనిఖా సురేంద్రన్ ) తో విడి పోతాడు. దీంతో మనోడు నిరాశకు లోనవుతాడు. ప్రేమ, వివాహంపై నమ్మకం కోల్పోవడం ప్రారంభిస్తాడు.
ఇదే సమయంలో ఉన్నట్టుండి తాను బడిలో చదువుకుంటున్న సమయంలో ఫ్రెండ్ గా ఉన్న ప్రీతి (ప్రియా ప్రకాశ్ వారియర్) తళుక్కున తగులుతుంది. దీంతో నీలా పట్ల తనకు ఉన్న భావాలు మరింత క్లిష్టరతం గా మారి పోతాయి. నీలా పెళ్లికి ఆహ్వానం అందుకున్నప్పుడు తన గతం, వర్తమానం గుర్తుకు వస్తుంది. జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాకు సంబంధించి నీలా, ప్రీతి ఇద్దరిలో ఎవరి వైపు ప్రభు మొగ్గు చూపుతాడనే దానిపై తెలుసు కోవాలంటే సినిమా చూడాలి.
దర్శకుడిగా ఇంకాస్త ధనుష్(Dhanush) శ్రద్ద పెట్టి ఉంటే బావుండేది. సంగీతం పరంగా ఓకే. మొత్తంగా ఇది సినిమా కంటే ఓటీటీలో చూడాల్సిన సినిమా అని చెప్పక తప్పదు.
Also Read : Beauty Bhumi Pednekar :ఆ డైరెక్టర్ సాయం మరిచి పోలేను