Dhanush-Nayanthara : ధనుష్, నయనతార కేసులో నయన్ కు మద్రాసు కోర్టు నోటీసులు

ఆ మాటలు మా జీవితానికి ఎంతో ముఖ్యమనుకున్నారు...

Dhanush : ‘నయనతార: ‘బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌’ డాక్యుమెంటరీ’ విషయంలో నటి నయనతార, నటుడు ధనుష్‌కు మధ్య వివాదం జరుగుతున్న సంగతి తెలిసిందే! ధనుష్‌ తీరును తప్పుబడుతూ నయన్‌ ఒక బహిరంగ లేఖ కూడా విడుదల చేశారు. దీనిపై తాజాగా నయనతార(Nayanthara) క్లారిటీ ఇచ్చారు. ఆమె అలా చేయడానికి గల కారణాన్ని బయటపెట్టారు. డాక్యుమెంటరీ విషయంలో ఏం జరిగిందనేది వివరంగా చెప్పారు.

Dhanush-Nayanthara Case…

తాజాగా ఓ ఇంటర్వూయలో ధనుష్‌(Dhanush) గురించి లేఖ రిలీజ్‌ చేేసంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది’ అనే ప్రశ్న అడగ్గా ‘‘న్యాయమని నమ్మిన దాన్ని బయటపెట్టడానికి నేను ఎందుకు భయపడాలి? తప్పు చేస్తే భయపడాలి. పబ్లిసిటీ కోసం ఎదుటి వ్యక్తుల పేరు ప్రతిష్టలను దెబ్బతీసే మనిషిని కాదు. నేను. నా డాక్యుమెంటరీ ఫిల్మ్‌ పబ్లిసిటీ కోసమే మేము ఇదంతా చేశానని చాలామంది మాట్లాడుకుంటున్నారు. అందులో నిజం లేదు. వీడియో క్లిప్స్‌కు సంబంధించిన ఎన్‌వోసీ కోసం ధనుష్‌ను సంప్రదించడానికి ఎంతో ప్రయత్నించాం. విఘ్నేశ్‌, నేనూ ఇద్దరం కాల్‌ చేశాం. కామన్‌ ఫ్రెండ్స్‌ కూడా ఫోన్స్‌ చేశారు. ఎంత ప్రయత్నించినా మాకు ఎన్‌వోసీ రాలేదు. సినిమాలో ఉపయోగించిన నాలుగు లైన్ల డైలాగ్‌ మా డాక్యుమెంటరీ ఫిల్మ్‌లో ఉపయోగించాలనుకున్నాం.

ఆ మాటలు మా జీవితానికి ఎంతో ముఖ్యమనుకున్నారు. ఈ విషయంపై ఆయన మేనేజర్‌ను కూడా సంప్రదించా. ధనుష్‌తో ఒక్కసారి మాట్లాడాలనుకుంటున్నానని చెప్పా. ఆయనకు నాపై ఎందుకు కోపం వచ్చింది? ఆయన మమ్మల్ని ఎందుకు ద్వేషిస్తున్నారు? పక్కవాళ్లు చెప్పిన మాటలే మైనా వింటున్నారా? ఇలాంటి విషయాలు చేసుకోవడానికి ఆయనతో ఒక్కసారి మాట్లాడాలనుకున్నా. కాకపోతే అది జరగలేదు. ముందు నుంచి మేమిద్దరం ఏమీ శత్రువులం కాదు. ఆయన నాకు మంచి మిత్రుడు. కాకపోతే ఈ పదేళ్లలో ఏం జరిగిందో నాకు తెలియదు’’ అని నయన్‌ అన్నారు.

నయనతారజీవితాన్ని ఆధారంగా చేసుకొని తెరకెక్కిన్న డాక్యుమెంటరీ ఫిల్మ్‌ ‘నయనతార బియాండ్‌ ది ఫెయిరీ టేల్‌. తన పర్మిషన్‌ తీసుకోకుండా ఇందులో ‘నానుమ్‌ రౌడీ దాన్‌’ ఫుటేజ్‌ను ఉపయోగించారని ఆరోపిస్తూ చిత్ర నిర్మాత, నటుడు ధనుష్‌ లీగల్‌ నోటీసులు ఇచ్చారు. మూడు సెకన్ల క్లిప్‌నకు రూ.10 కోట్లు డిమాండ్‌ చేశారు. ఈ క్రమంలోనే నయనతార ధనుస్‌ క్యారెక్టర్‌ను తప్పుబట్డారు. తనను ఆయన ద్వేషిస్తున్నారంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. లీగల్‌ నోటీసులు పంపించినప్పటికీ డాక్యుమెంటరీలో ఆ సన్నివేశాలు ఉపయోగించారని ధనుష్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. నయన్‌ దంపతులపై కోర్టులో దావా వేశారు. అయితే దీనిపై మద్రాస్‌ కోర్టు విచారణ చేపట్టింది. జనవరి 8లోపు నయన్‌ దంపతులతోపాటు నెట్‌ఫ్లిక్స్‌ బృందానికి కూడా కోర్టు ఆదేశించింది. ఈ మేరకు నయన్‌కు నోటీసులు పంపారు.

Also Read : Sai Pallavi : సినిమా కోసం తన అలవాట్లు మార్చుకున్నారంటూ వస్తున్న వార్తలపై భగ్గుమన్న సాయి పల్లవి

dhanushNayantharaPolice CaseUpdatesViral
Comments (0)
Add Comment