Dhanush : బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతీ సనన్ న్యూ ఇయర్ లో కొత్త ప్రాజెక్టులోకి అడుగు పెట్టింది. తను నటిగానే కాదు నిర్మాతగా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఏ తేరే ఇష్క్ మే మూవీ షూటింగ్ ప్రారంభమైంది. కథ అద్భుతంగా ఉందని, ఇది తనను ఎంతగానో ఆకట్టుకుంటోందని చెప్పింది.
Dhanush-Kriti Sanon Movie
ఆనంద్ ఎల్ రాయ్ రాబోయే ప్రాజెక్టు ఇది. అధికారికంగా ప్రారంభం కావడంతో ఆనందం వ్యక్తం చేసింది. ఇందులో కృతీ సనన్ తమిళ సినీ స్టార్ ధనుష్(Dhanush) తో కలిసి నటిస్తుండడం విశేషం. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికరమైన పోస్ట్ ను పంచుకుంది.
సోషల్ మీడియా వేదికగా క్లాప్ బోర్డు చిత్రాన్ని షేర్ చేసింది. ఉత్తేజకరమైన అప్ డేట్ ను పంచుకుంది ఫ్యాన్స్ కు. తొలి రోజు ఎంతో సంతోషంగా ఉంది. కొత్త లుక్ , కొత్త ప్రాజెక్టుతో కొత్త రంగంలోకి ఎంట్రీ ఇవ్వడం జీవితంలో మరిచి పోలేనంటూ పేర్కొంది హీరోయిన్. సెట్ లోకి తిరిగి రావడంతో మరింత అనుభూతి కలిగించేలా చేస్తోందని తెలిపింది.
ఇక సినిమా పరంగా చూస్తే కృతీ సనన్ ముక్తి పాత్రను పోషిస్తుండగా ధనుష్ ఈ చిత్రంలో శంకర్ పాత్రను పోషిస్తున్నాడు. ఎల్లో ప్రొడక్షన్ దీనిని నిర్మిస్తోంది. ధనుష్, ఆనంద్ ఎల్ రాయ్ కలిసి చేస్తున్న సినిమా ఇది మూడోది కావడం గమనార్హం.
2013లో రాంఝనా, 2021లో అత్రంగి రే తర్వాత ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. నవంబర్ 28న ఎ తేరే ఇష్క్ మెయిన్ చిత్రాన్ని విడుదల చేస్తామని ప్రకటించారు మూవీ మేకర్స్.
Also Read : Toronto Flight Flip Shocking :మంచు ప్రభావం బోల్తా పడిన విమానం