Hero Dhanush-Nitya :నిత్య‌..ధ‌నుష్ ఇడ్లీ క‌డై మూవీపై ఫోక‌స్

మూవీ విడుద‌ల తేదీ మారే అవ‌కాశం

Dhanush : న‌టుడు ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఇడ్లీ క‌డై మూవీపై భారీ అంచ‌నాలు ఉన్నాయి. ఇందులో ధ‌నుష్ తో పాటు నిత్య మీన‌న్ కీల‌క పాత్ర‌ల‌లో న‌టిస్తున్నారు. ఓ వైపు సినిమాల‌లో న‌టిస్తూనే ఇంకో వైపు ద‌ర్శ‌క‌త్వంపై దృష్టి సారించాడు ధ‌నుష్.

Dhanush-Nitya Menon Movie

ఇటీవ‌ల త‌ను తీసిన నీక్ విడుద‌లై మంచి పేరు తీసుకు వ‌చ్చేలా చేసింది. టేకింగ్, మేకింగ్ లో మంచి ప‌నితీరు క‌న‌బ‌ర్చాడు. ఇడ్లీ క‌డై సినిమాను ఏప్రిల్ 10న విడుద‌ల చేస్తార‌ని అనుకున్నారు. కానీ ఈ సినిమా వాయిదా ప‌డ‌వ‌చ్చ‌ని సినీ వ‌ర్గాల నుంచి అందిన స‌మాచారం. ఆగ‌స్టు లేదా సెప్టెంబ‌ర్ నెల‌లో రిలీజ్ చేయొచ్చ‌ని అంచ‌నా.

ధ‌నుష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీలోని కొన్ని భాగాలు ఇంకా అసంపూర్తిగా ఉండ‌డంతో వాయిదా వేయాల‌ని నిర్ణ‌యించిన‌ట్లు టాక్. మ‌రో వైపు హిందీలో స్ట్రెయిట్ సినిమా చేస్తున్నాడు ధ‌నుష్(Dhanush) చాన్నాళ్ల త‌ర్వాత‌.

ఈ సినిమాకు ఆనంద్ ఎల్ రాయ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ లో బిజీగా ఉన్నారు ధ‌నుష్. దీంతో ఇడ్లీ కడై సినిమా చివ‌రి షెడ్యూల్ వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. మ‌రో వైపు ఇంకో అప్ డేట్ వ‌చ్చింది ధ‌నుష్ గురించి . త‌న ద‌ర్శ‌క‌త్వంలో కొత్త ప్రాజెక్టు స్టార్ట్ చేసేందుకు రెడీ అయ్యాడని, ఇందులో అజిత్ కుమార్ హీరోగా న‌టిస్తున్న‌ట్లు తెలిసింది. అనిరుధ్ ర‌విచంద‌ర్ సంగీతం అందిస్తున్న‌ట్లు టాక్.

Also Read : Hero Rajinikanth-Rajadhi Raja :36 ఏళ్ల త‌ర్వాత ర‌జ‌నీ రాజాధి రాజా

 

CinemadhanushNithya MenenTrendingUpdates
Comments (0)
Add Comment