Idli Kadai : తమిళ సినీ రంగంలో మోస్ట్ పాపులర్ హీరో ధనుష్. తను నటుడే కాదు దర్శకుడు కూడా. తలైవా రజనీకాంత్ కూతురితో కటీఫ్ చెప్పాక తన కెరీర్ మరింత ఊపు మీదుందని చెప్పక తప్పదు. తను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాడు. దర్శకత్వ పరంగా ఫుల్ మార్కులు కొట్టేశాడు మనోడు. ఇదే సమయంలో తను తాజాగా తీసిన చిత్రం ఇడ్ల కడై. తెలుగులో దీని అర్థం ఇడ్లీ కొట్టు . ఎవరూ ఊహించని రీతిలో సినీ ఇండస్ట్రీని ఓ వార్త షేక్ చేస్తోంది. అదేమిటంటే ఈ సినిమా గురించి. ఏకంగా నెట్ ఫ్లిక్స్ ఇడ్ల కడై(Idli Kadai)ని ఏకంగా రూ. 45 కోట్లకు చేజిక్కించుకుందని .
Idli Kadai Movie OTT Updates
ఇదిలా ఉండగా గత ఏడాది 2024లో తను తీసిన రాయన్ షాక్ ఇచ్చింది. బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్ తెచ్చుకుని రూ. 100 కోట్ల కలెక్షన్స్ దాటేసింది. ఆ తర్వాత వచ్చిన మూవీ జాబిలమ్మ చిత్రంకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం పూర్తిగా వినోదాత్మకంగా తెరకెక్కించాడు ధనుష్. ఇందులో తన మేనల్లుడిని పరిచయం చేశాడు హీరోగా. ప్రవీష్ నారాయణన్ తన అంచనాలకు మించి నటించి మెప్పించాడు. ప్రేక్షకుల మనసు దోచుకున్నాడు.
దర్శకుడు ధనుష్ తను తీసి, నటించిన ఇడ్లీ కొట్టు గురించి కీలక అప్ డేట్ ఇచ్చాడు. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తామని తెలిపాడు. అయితే ఈ మూవీ ప్యాన్ ఇండియా చిత్రం కాక పోయినా ఆశించిన దానికంటే అంచనాలు పెంచుతూ భారీగా వసూళ్లు చేయడం విస్తు పోయేలా చేస్తోంది సినీ వర్గాలను. ఇంకా విడుదల కాక ముందే సినిమాకు ఇంత రేంజ్ లో ఓటీటీ ధర పలకడం చూస్తుంటే పక్కాగా బ్లాక్ బస్టర్ కొట్టడం ఖాయంగా కనిపిస్తోంది.
Also Read : Beauty Keerthy Suresh :బాలీవుడ్ మూవీకి కీర్తి సురేష్ ఓకే