Dhanush : స్టార్ హీరో ధనుష్ ‘రాయన్’ వంటి హిట్ చిత్రం తర్వాత ‘నిలవుక్కు ఎన్ మేల్ ఎన్నడి కోపం’ అనే పేరుతో మరో చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందులో హీరోగా తన అక్క కుమారుడు బవిష్‌ను వెండితెరకు హీరోగా పరిచయం చేస్తున్నారు. ఇందులో అనైకా సురేంద్రన్, మాథ్యూ థామస్, ప్రియా ప్రకాష్ వారియర్, శరత్ కుమార్ వంటి ముఖ్య తారాగణం నటిస్తున్నారు. జీవీ ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని వండర్‌బార్ ఫిలిమ్స్, ఆర్‌కే ప్రొడక్షన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇటీవల ఈ సినిమా నుంచి ‘గోల్డన్ స్పెరో’ అంటూ సాగే తొలి సింగిల్ ప్రోమో రిలీజ్ చేశారు. పాటను 30న విడుదల చేయనున్నారు. ఇందులో హీరోయిన్ ప్రియాంకా మోహన్ కేమియో రోల్ పోషించారు.
Dhanush 3rd Movie Updates
ధనుష్ – ప్రియాంక కలిసి ‘కెప్టెన్ మిల్లర్’ మూవీలో నటించిన విషయం తెల్సిందే. ఆ కారణంగానే ఈ చిత్రంలో ప్రియాంక కేమియో రోల్ చేసేందుకు అంగీకరించారనే టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాతలు కస్తూరిరాజా, విజయలక్ష్మి కస్తూరిరాజా.
Also Read : Malavika Mohanan : కోల్కతా డాక్టర్ హత్యాచార ఘటనపై స్పందించిన ‘మాళవిక మోహనన్’