Devoleena Bhattacharjee: ప్రెగ్నెన్సీ రూమర్స్‌ పై స్పందించిన బుల్లితెర నటి దేవలీన !

ప్రెగ్నెన్సీ రూమర్స్‌ పై స్పందించిన బుల్లితెర నటి దేవలీన !

Devoleena Bhattacharjee: సెలబ్రెటీలకు పెళ్ళైందంటే చాలు పిల్లలెప్పుడు అనే దానిపై నెట్టింట తెగ రచ్చ జరుగుతోంది. నిన్న కాక మొన్న లూజ్ అవుట్ ఫిట్ లో బాలీవుడ్ బ్యూటీ కత్రినా కైఫ్ కనిపించే సరికి… ఆమె ప్రెగ్నెంట్ అంటూ రూమర్స్ వచ్చాయి. దీనితో ఆమె భర్త బాలీవుడ్ స్టార్ హీరో తన సినిమా ప్రమోషన్ లో ప్రెగ్నెంట్ విషయంపై క్లారిటీ ఇవ్వాల్సి వచ్చింది. ఇది ఇలా ఉండగా మరో బాలీవుడ్ బ్యూటీ పెళ్లి పీటలెక్కి మూడు రోజులైందో లేదో అప్పుడే ఆమె ప్రెగ్నెంట్ అంటూ పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

Devoleena Bhattacharjee…

అయితే ఈ ప్రెగ్నెన్సీ పుకార్ల లిస్ట్ లో తాజాగా బుల్లితెర నటి దేవలీన భట్టాచార్జి చేరింది. దేవలీన భట్టాచార్జి(Devoleena Bhattacharjee) త్వరలో తల్లి కాబోతుందంటూ ఓ వార్త వైరల్‌గా మారింది. దీనితో తాజాగా ఈ రూమర్స్‌పై నటి దేవలీన స్పందించింది. ‘నేను ప్రెగ్నెంటా ? అని అడుగుతూ చాలాకాలంగా మెసేజ్‌లు వస్తున్నాయి. అది నాకు చెప్పాలని అనిపించినప్పుడే చెప్తాను. అయినా ఇలాంటిదేదైనా ఉంటే నా అంతట నేనే చెప్తా. అప్పటివరకు నన్ను వదిలిపెట్టండి. నేను ప్రెగ్నెంటో ? కాదో ? తెలుసుకుని మీరేం చేస్తారు ? నాకేదైనా మంచి విషయాలు, సూచనలు చెప్తారా ? లేదా ట్రోల్‌ చేస్తారా ? ఇప్పుడవన్నీ పట్టించుకునే స్థితిలో నేను లేను. ఇది నా జీవితం. నాకు నచ్చినట్లు బతకనివ్వండి. ఇందులో ఎవరూ జోక్యం చేసుకోవద్దు’ అని ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో రాసుకొచ్చింది.

కాగా దేవలీనా భట్టాచార్జీ(Devoleena Bhattacharjee) ఒక భారతీయ టెలివిజన్ నటి. అలాగే శిక్షణ పొందిన భరతనాట్యం నర్తకి కూడా. ఆమె స్టార్‌ప్లస్ దీర్ఘకాల పాపులర్ షో సాథ్ నిభానా సాథియాలో గోపీ మోడీ పాత్ర పోషించినందుకు ప్రసిద్ధి చెందింది. ఆమె బిగ్ బాస్ హిందీ సీజన్ 13, బిగ్ బాస్ హిందీ సీజన్ 14, బిగ్ బాస్ హిందీ సీజన్ 15లలో కూడా పాల్గొంది. స్వీట్ లై (2019), లంచ్ స్టోరీస్ (2021), ఫస్ట్ సెకండ్ చాన్స్ (2022) వెబ్ సీరీస్ లలో నటించిన ఆమె 2024లో ఓటిటిలో స్ట్రీమింగ్ కు సిద్దమైన హిందీ చిత్రం బెంగాల్ 1947తో సినిమారంగ ప్రవేశం కూడా చేసింది. హే గోపాల్ కృష్ణ కరూ ఆరతి తేరీ (2017) అంటూ హిందీలో, రామధేను (2019) అంటూ అస్సామీ భాషలోనూ ఆమె మ్యూజిక్ వీడియో చేసింది.2015లో సాథ్ నిభానా సాథియా ధారావాహికలో తన నటనకుగాను ఆమెకు బెస్ట్ యాక్ట్రెస్ ఇన్ ఎ లీడ్ రోల్ పురస్కారాన్ని ఇండియన్ టెలీ అవార్డ్స్ అందించింది. దేవలీనా.. షానవాజ్‌ షైఖ్‌ను 2022 డిసెంబర్‌లో పెళ్లి చేసుకుంది.

Also Read : Pushkara Mallikarjunaiah: నేషనల్‌ అవార్డ్‌ సినిమా నిర్మాతకు వడ్డీ వ్యాపారుల వేధింపులు !

BigbossDevoleena BhattacharjeePregnancy Rumours
Comments (0)
Add Comment