నవీన్ మేడారం, అభిషేక్ నామ దర్శకత్వం వహించిన డెవిల్ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో కళ్యాణ్ రామ్, మాళవిక నాయర్ నటించారు. ఒక చీకటి రహస్యాన్ని ఛేదించే పనిని చేపట్టే బ్రిటీష్ సీక్రెట్ ఏజెంట్ ను అనుసరిస్తారు. ప్రేమ, మోసం, ద్రోహం ఆధారంగా దీనిని తెరకెక్కించే ప్రయత్నం చేశారు.
డెవిల్ మూవీని శ్రీకాంత్ విస్సా, నవీన్ మేడారం కథ రాశారు. ఈ సినిమాకు సంబంధించి విడుదల చేసిన పోస్టర్స్ , ఫస్ట్ లుక్ ఇప్పటికే మంచి ఆదరణ చూరగొన్నాయి. ఈ చిత్రాన్ని వచ్చే నవంబర్ 24న రిలీజ్ చేసేందుకు మూవీ మేకర్స్ డిసైడ్ అయ్యారు.
మార్క్ బెన్నింగ్టన్ , బ్రాకెన్ , సంయుక్త మీనన్ , నందమూరి కళ్యాణ్ రామ్ , ఎడ్వర్డ్ సోన్నెన్ బ్లిక్ , బెల్ , జాహిద్ డిక్రూజ్ కీలకంగా వ్యవహరించనున్నారు. గతంలో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసార మూవీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ చిత్రం తర్వాత వస్తున్న మూవీ డెవిల్. దీనిపై ఎక్కువగా అంచనాలు పెట్టుకున్నారు.
ఇదిలా ఉండగా దసరా పండుగకు సినీ ఫ్యాన్స్ కు అసలైన సంతోషం కలగబోతోంది. భారీ సినిమాలు పండుగకు రిలీజ్ కానున్నాయి. వాటిలో భగవంత్ కేసరి, టైగర్ నాగేశ్వర్ రావు, లియో రానున్నాయి.