Janhvi : డైనమిక్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప గురించి ఎంత చెప్పినా తక్కువే. బన్నీ మేనరిజం, శ్రీవల్లి పాత్రలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా నటన , సమంత రుత్ ప్రభు చేసిన ఊ అంటావా పాట స్పెషల్ అట్రాక్షన్ గా మారాయి. ఈ సినిమా ఇండియాను షేక్ చేసింది. బాలీవుడ్ ను విస్తు పోయేలా చేసింది. ఇక పుష్పకు సీక్వెల్ గా దర్శకుడు చేసిన మ్యాజిక్ పుష్ప-2 చిత్రం రికార్డుల మోత మోగించింది. ఏకంగా రూ. 2200 కోట్ల మార్క్ ను దాటేసింది వరల్డ్ వైడ్ గా.
Janhvi Kapoor Special Song
ఇందులో లవ్లీ బ్యూటీ శ్రీలీల నటించిన స్పెషల్ సాంగ్ కిస్సక్ కిర్రాకు పుట్టించింది. మరోసారి తన సత్తా ఏమిటో చూపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. ఈ రెండు సినిమాలకు సంగీతం అందించాడు ఇండియన్ రాక్ స్టార్ గా పేరొందిన దేవిశ్రీ ప్రసాద్(Devi Sri Prasad). సినిమా భారీ విజయం అందుకోవడంతో తను కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇదిలా ఉండగా సినిమా నిర్మాతలు మైత్రీ మూవీ మేకర్స్ కీలక ప్రకటన చేశారు. పుష్ప-2కు సీక్వెల్ గా పుష్ప-3 ఉండబోతోందని. దీనిపై స్పందించాడు దేవిశ్రీ ప్రసాద్. రాబోయే ఈ మూవీలో స్పెషల్ సాంగ్ కు దివంగత నటి శ్రీదేవి ముద్దుల కూతురు, తారక్ నటించిన దేవర మూవీ ఫేం జాన్వీ కపూర్ అయితే బాగుంటుందని, తనే నా బెస్ట్ ఛాయిస్ అంటూ పేర్కొన్నాడు. తను చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ గా మారాయి. మరి దేవిశ్రీ మాట సుకుమార్ వింటాడో లేదో చూడాలి.
Also Read : Hero Vishal-Madha Gaja Raja : లేటైనా ‘మధ గజ రాజా’ సూపర్ సక్సెస్