Devara : ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న చిత్రం ‘దేవర’. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ నటించగా… విలన్ పాత్రలో సైఫ్ ఆలీఖాన్… ఓ ముఖ్య పాత్రలో శ్రీకాంత్ నటిస్తున్నారు. ఇటీవలే గోవాలో షెడ్యూల్ ను పూర్తి చేసుకున్న ‘దేవర(Devara)’… పస్తుతం హైదరాబాద్ లో ప్రత్యేక సెట్ లో తదుపరి షెడ్యూల్ జరుగుతోంది. అయితే గోవాలో షూటింగ్ జరుగుతున్న సమయంలో శ్రీకాంత్ కు గాయపడినట్లు తెలుస్తోంది. ‘కోటబొమ్మాళి పిఎస్’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ టీవి రియాలిటీ షోకు ముఖ్య అతిథిగా హాజరయిన శ్రీకాంత్ ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు.
Devara – గాయంతోనే షూటింగ్ పూర్తి చేసిన శ్రీకాంత్
‘దేవర’ షూటింగ్ సెట్ కు ఇసుకలో నడుచుకుంటూ వెళ్తుండగా కాలు మడత పడటంతో క్రింద పడ్డాను. చిన్నగాయమే అనుకుని షూటింగ్ లో పాల్గొన్న. అయితే కాలు వాచిపోవడంతో డాక్టర్ దగ్గరకు వెళ్ళగా కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే చిత్ర యూనిట్ షెడ్యూల్ మొత్తం డిస్టర్బ్ అవుతందని… గాయంతోనే నా పార్టు షూటింగ్ కంప్లీట్ చేసారు. ఇప్పుడు కూడా దేవర(Devara) సెట్ నుండి నేరుగా ఇక్కడకు వచ్చాను అంటూ శ్రీకాంత్ రియాలిటీ షోలో వివరించారు. దీనితో డాక్టర్ల సలహామేరకు కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోవాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.
ఏప్రిల్ 5న వస్తున్న ‘దేవర’
ఆర్.ఆర్.ఆర్ సినిమా తరువాత ఎన్టీఆర్ నటిస్తున్న భారీ బడ్జెట్ సినిమా ‘దేవర’. సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను 2024 ఏప్రిల్ 5న మొదటి పార్టును విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తుంది. సముద్ర తీరం నేపథ్యంలో… భయం అనే అంశం ప్రధానంగా సాగే ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు సైఫ్ అలీఖాన్, మలయాళ నటుడు షైన్ టామ్ చాకో విలన్స్ గా కనిపించబోతున్నారు. ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకి రత్నవేలు సినిమాటోగ్రాఫర్.
Also Read : Mani Ratnam: అభిమానులకు ‘మణిరత్నం’ క్లాస్