Devara Promotions : దేవర ప్రమోషన్స్ లో సందడి చేసిన ఎన్టీఆర్

ఆ విషయం ఆ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌కి వస్తే....

Devara : ‘దేవర’ సినిమా ప్రమోషన్స్ చూస్తుంటే.. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ స్థాయిని దిగజార్చేలా ప్లానింగ్ చేస్తున్నారనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘ ఆర్ఆర్ఆర్’ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు యంగ్ టైగర్ ఎన్టీఆర్‌. అలాంటిది ఆయన హీరోగా నటిస్తున్న ‘దేవర(Devara)’ సినిమా ప్రమోషన్స్‌ను… అసలు సినిమాకు సంబంధమేలేని వ్యక్తులతో ఇంటర్యూలు ప్లాన్ చేయటం చర్చనీయాంశం అయింది. ఇక ఇటీవల ముంబై వెళ్లిన ‘దేవర’ టీమ్ అక్కడ ఆలియా భట్, సందీప్ రెడ్డి వంగా కాంబోలో ఇంటర్యూలు చేయించారు. ఆలియా భట్ ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘జిగ్రా’ విడుదలకు సిద్ధమవుతోన్న క్రమంలో ‘దేవర వర్సెస్ జిగ్రా’ పేరుతో కరణ్ జోహార్ ఓ ఇంటర్యూ చేశాడు. కరణ్ జోహార్ ఈ సినిమాను హిందీలో విడుదల చేస్తున్నారు కాబట్టి మార్కెటింగ్ కోసం చేశాడనుకోవచ్చు. కానీ సందీప్ రెడ్డి వంగా, దేవర టీమ్‌ని ఇంటర్యూ చేయటం మరీ విడ్డూరం.. ఈ ఇంటర్యూ తాజాగా విడుదలైంది.

Devara Promotions…

నార్త్‌లో సినిమాపై హైప్ లేని కారణంగా అక్కడ క్రేజ్ ఉన్న సందీప్ రెడ్టి వంగాతో ఈ విధంగా ఇంటర్యూ‌లను టీమ్ ప్లాన్ చేశారా అనటానికి.. ‌ఎన్టీఆర్‌కు అక్కడున్న క్రేజ్ ఏమైంది. అలాగే కపిల్ శర్మ షో సీజన్ 2లో కూడా ‘దేవర(Devara)’ ప్రమోషన్స్ జరిగాయి. ఆ షోకు సంబంధించి ప్రోమో ఒకటి సోషల్ మీడియా సర్కిల్స్‌లో వైరల్ అవుతోంది. ఈ ప్రోమో చూస్తుంటే మరీ దారుణంగా ఎన్టీఆర్‌ని కమెడియన్‌ని చేశారా? అని అనిపిస్తుంది. ఎందుకంటే.. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో సినిమా ప్రమోషన్స్ నిమిత్తం సెలబ్రిటీలు వస్తే చాలా గౌరవంగా వారిని ట్రీట్ చేస్తారు. కానీ కపిల్ శర్మ షోలో అలా జరగలేదు.

ఆ విషయం ఆ ప్రోమో చూస్తుంటేనే తెలుస్తోంది. ఇక టాలీవుడ్‌కి వస్తే.. ఇక్కడ సిద్దు, విశ్వక్‌లతో ఎన్టీఆర్, కొరటాల ఇంటర్వ్యూను రికార్డు చేయటం అభిమానులను ఆశ్చర్యపరిచింది. ఇలా యంగ్ హీరోలతో ఇంటర్వ్యూ.. చూడడానికి ఎంటర్‌టైనింగ్‌గా కనిపించినా.. ఎన్టీఆర్‌కి ఉన్న రేంజ్ ఏంటి? వారితో ఇంటర్వ్యూ ఏంటి? యూట్యూబ్ ఛానల్ వ్యూస్‌కు తప్పితే.. ‘దేవర(Devara)’ సినిమాకు ఇవి ఏ విధంగా ఉపయోగపడతాయి.. అసలు సినిమాలో విషయం ఉండాలి కదా అనే కామెంట్స్ సోషల్ మీడియాలో దర్శనమిస్తున్నాయి.

ఇలా ఎన్టీఆర్ ఇమేజ్‌కు డామేజ్ కలిగించే ప్రయత్నం జరిగిందని, ఎన్టీఆర్ రేంజ్‌ను తగ్గించే ప్రయత్నమిదనే చర్చ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఆల్రెడీ ముంబై ఈవెంట్‌లో జై ఎన్టీఆర్ నినాదాలకు డబ్బులిచ్చి జనాలను కూడగట్టారనే అపవాదు విపరీతంగా వైరల్ అవ్వగా..‌ తెలుగు మీడియా కంటే నార్త్ మీడియాకే ‘దేవర’ టీమ్ ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం..‌ తెలుగు మీడియాలో కూడా ఒకరిద్దరు చాలు అన్నట్టుగా వ్యవహరించటం కారణంగా ‘దేవర’కు సరైన రీతిలో ప్రమోషన్స్ జరగకపోగా.. జూనియర్ ఎన్టీఆర్ రేంజ్‌ని దిగజార్చే ప్రయత్నాలు జరుగుతాన్నాయనే బాధ అభిమానుల్లో సైతం వ్యక్తమవుతోంది.

Also Read : Coolie Movie : ‘కూలీ’ సెట్లో డాన్సులతో సందడి చేసిన తలైవా

DevaraTrendingUpdatesViral
Comments (0)
Add Comment