Devara: కొంప ముంచిన ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ! నోవాటెల్ కు రూ. 33 లక్షల ఆస్థి నష్టం !

కొంప ముంచిన 'దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు ! నోవాటెల్ కు రూ. 33 లక్షల ఆస్థి నష్టం !

Devara: సుమారు ఆరేళ్ళ తరువాత జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా ‘దేవర(Devara)’. స్టైలిష్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్(Jr NTR) సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటించగా… ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కించిన ఈ సినిమాలో మొదటి పార్టును సెప్టెంబర్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేస్తుండటంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించడానికి ఏర్పాట్లు చేసారు. గ‌త ఆదివారం రాత్రి హైదరాబాద్‌ నోవాటెల్‌ హోటల్‌లో జరపాల‌ని నిర్ణ‌యించ‌గా కెపాసిటీని మించి అభిమానులు, ఆడియన్స్‌ ఈ ఈవెంట్‌ కు హాజరు కావడంతో పరిస్థితి ఉద్రిక్త‌త నెలకొంది. దీనితో ఈవెంట్ ర‌ద్ద‌వ‌డం, ఫ్యాన్స్ రెచ్చిపోవ‌డం చ‌క‌చ‌కా జ‌రిగిపోయిన విష‌యం తెలిసిందే.

Devara…

అయితే ఈ ఘ‌ట‌న స‌ద‌రు నిర్మాణ సంస్థ‌కు కొత్త త‌ల‌నొప్పులు తీసుకువ‌చ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ క్యాన్సల్ అవడంతో ఆగ్రహావేశాలకు గురైన అభిమానులు అక్క‌డి ఫర్నిచర్ ఇతర సామాగ్రిని బద్దలు కొట్టారు. తోపులాటలో హోటల్‌ లో అద్దాలు కూడా ధ్వంసమ‌య్యాయి. పోలీసులు కంట్రోల్‌ లోకి తీసుకుని చక్కబరిచే ప్రయత్నం చేయగా విఫలమై ఈవెంట్‌ నే రద్దు చేశారు. దీనితో ఈవెంట్ ని హోస్ట్ చేస్తున్న హోటల్‌ కు భారీ నష్టం చేకూరింది. ఆ న‌ష్టాన్ని చెల్లించాల‌ని నోవాటెల్ యాజ‌మాన్యం కోర‌డంతో ఇప్పుడు నిర్మాతలు ఆ నష్టాన్ని తీర్చేందుకు బేరాలాడటం విశేషం.

ఎట్టకేలకు రిలీజ్ డేట్ దగ్గర పడటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై తమ అభిమాన హీరో స్పీచ్ వినాలని అభిమానులు సుదూర ప్రాంతాల నుండి వచ్చారు. ఇంకా కొన్ని గంటల్లోనే తమ అభిమాన నటుడి రాక గురుంచి అప్డేట్ వస్తుందనుకున్న సమయంలో ఈవెంట్ క్యాన్సల్ అనే అనౌన్స్ మెంట్ వచ్చింది. దీనితో కట్టలు తెంచుకున్న ఆగ్రహంతో అభిమానులు కుర్చీలు ఇతర కనిపించిన సామాగ్రి పగలగొట్టారు. కాగా, ఇప్పుడు నష్టాన్ని అంచనా వేసిన హోటల్ యాజమాన్యం 33 లక్షలని లెక్కలు తేల్చింది. ప్రధానంగా కుర్చీలకే రూ.7లక్షల వరకు అయినట్లు తెలుస్తోంది. అలాగే మెయిన్ గ్లాస్, ఎలివేటర్ గ్లాస్, కొన్ని డోర్లు కూడా తీవ్రంగా ధ్వంసం అయ్యాయి. దీనితో మొత్తంగా రూ. 33 లక్షల ఆస్థి నష్టం జరిగిందట. కాగా , ఈ బిల్లుని కాస్త తగ్గించాలని నిర్మాణ సంస్థ ఇప్పుడు బేరాలకు దిగినట్లు సమాచారం.

Also Read : Kill Movie : ఇప్పుడు తెలుగులో స్ట్రీమింగ్ కు సిద్ధమవుతున్న ‘కిల్’ సినిమా

DevaraJr NTRkoratala siva
Comments (0)
Add Comment