Devara: కొరటాల శివ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ జంటగా నటిస్తున్న తాజా సినిమా ‘దేవర’. బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ విలన్ గా నటిస్తున్న ఈ సినిమాను సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థ నిర్మిస్తున్నారు. తీరం నేపథ్యంలో సాగే యాక్షన్ కథాంశంతో ఇది తెరకెక్కుతోన్న ఈ సినిమాకు మ్యూజిక్ సన్సేషన్ అనిరుధ్ సంగీతం అందిస్తున్నారు. రెండు పార్టులుగా విడుదల చేస్తున్న ఈ సినిమాను సెప్టెంబరు 27న మొదటి పార్టును విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ లుక్, గ్లింప్స్ కు విపరీతమైన స్పందన వచ్చింది.
Devara Movie Updates
ముగింపు దశలో ఉన్న ‘దేవర(Devara)’ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికర అప్ డేట్ ను ఛాయాగ్రాహకుడు రత్నవేలు సామాజిక మాధ్యమాల వేదికగా పంచుకున్నారు. ఎన్టీఆర్, సైఫ్‌లపై గోవా అడవుల్లో ఓ ఆసక్తికర యాక్షన్ సీక్వెన్స్‌ను పూర్తి చేసినట్లు తెలిపారు. దీనికి స్టంట్ మాస్టర్ పీటర్ హెయిన్స్ నేతృత్వం వహించారు. భారీ వర్షాలతో ప్రతికూల వాతావరణం ఉన్నప్పటికీ తారక్, సైఫ్‌లతో పాటు మిగిలిన చిత్ర బృందం సహకారంతో ఫైట్‌ను పూర్తి చేసినట్లు వెల్లడించారు. ప్రస్తుతం తదుపరి షెడ్యూల్ థాయ్‌లాండ్ లోని కాబ్రీ దీవుల్లో ప్రారంభించేందుకు చిత్ర యూనిట్ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అక్కడ ఎన్టీఆర్, జాన్వీలపై ఓ రొమాంటిక్ గీతాన్ని చిత్రీకరించనున్నారు. దీనికోసం వాళ్లిద్దరూ ఇప్పటికే అక్కడికి పయనమయ్యారు.
Also Read : Pushpa 2: డిసెంబరు 6కు ‘పుష్ప2’ వాయిదా !