Devara : ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం దేవర(Devara). భారీ అంచనాల నడుమ తెరకెక్కుతోన్న ఈ సినిమా కోసం ఎన్టీఆర్ అభిమానులే కాకుండా, యావత్ సినిమా ఇండస్ట్రీ వేయి కళ్లతో ఎదురు చూస్తోంది. ఆచర్యం వంటి ఫ్లాప్ తర్వాత ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో ఉన్న కొరటాల ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. అంచనాలకు అనుగుణంగానే ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్నారు. పాన్ ఇండియా రేంజ్‌లో విడులవుతోన్న ఈ సినిమాను రెండు పార్ట్స్‌గా తెరకెక్కిస్తున్నారు. సముద్రతీరం నేపథ్యంలో సాగే యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా మొదటి పార్ట్‌ను సెప్టెంబర్ 27వ తేదీన విడుదల చేయడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమా ద్వారా బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తెలుగు తెరకు పరిచయమవుతోంది. ఇక ఈ సినిమాలో సైఫ్ అలీఖాన్ విలన్ రోల్‌లో నటిస్తుండడంతో బాలీవుడ్‌లోనూ మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమాకు సంబంధించి ఇప్పుటి వరకు విడుదలైన పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది.
Devara Movie Updates
కాగా చిత్ర యూనిట్ అభిమానులకు తాజాగా వినాయక చవితిని పురస్కరించుకొని శుభవార్త తెలిపింది. ఈ మూవీ ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసింది. సెప్టెంబర్ 10వ తేదీన బిగ్‌స్క్రీన్‌పై ‘దేవర(Devara)’ ట్రైలర్‌ను లాంచ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. 2 నిమిషాల 45 సెకన్ల నిడివితో ఉండే ఈ ట్రైలర్ అభిమానులను కచ్చితంగా సర్‌ప్రైజ్ చేస్తుందని చిత్ర యూనిట్ ధీమాగా ఉంది. ఇక దేవర చిత్రం విడుదలకు ముందే సరికొత్త రికార్డులను తిరగరాస్తోంది. ఈ సినిమా ప్రీసేల్‌లో సత్తా చాటింది. అత్యధిక టికెట్స్ అమ్ముడయినట్లు చిత్రబృందం తెలిపింది. 5లక్షల కంటే ఎక్కువ టికెట్లు అమ్ముడయినట్లు టీమ్ చెప్పింది. దీంతో దేవరపై ఏ రేంజ్‌లో క్యూరియాసిటీ ఉందో ఇదే చెబుతోంది. మరి దేవర అంచనాలను ఏ మేర అందుకుంటుందో తెలియాంటే విడుదల వరకు వేచి చూడాలి.
Also Read : Fish Venkat : యాక్టర్ ఫిష్ వెంకట్ పరిస్థితి తెలిసి ఫోన్ లో పరామర్శించిన చిరు, చరణ్