Devara: యు.ఎస్‌లో ప్రీ సేల్స్‌ లో రచ్చరంబోలా చేస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ !

యు.ఎస్‌లో ప్రీ సేల్స్‌ లో రచ్చరంబోలా చేస్తున్న ఎన్టీఆర్ ‘దేవర’ !

Devara: మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర(Devara)’. స్టైలిష్ డైరెక్టర్ కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ నటిస్తుండగా… ప్రతినాయక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీఖాన్ నటిస్తున్నారు. నంద‌మూరి క‌ళ్యాణ్ రామ్ స‌మ‌ర్ప‌ణ‌లో సుధాకర్‌ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మాతలుగా ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో ప్ర‌కాష్ రాజ్‌, శ్రీకాంత్‌, షైన్ టామ్ చాకో, న‌రైన్ కీల‌క పాత్ర‌ల‌ను పోషిస్తున్నారు. రెండు పార్టులుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమాకు సంబంధించి మొదటి పార్టును సెప్టెంబర్ 27వ తేదీన తెలుగుతోపాటు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ప్రకటించారు.

Devara Movie Updates

ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’, ‘దావూదీ’యూట్యూబ్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. దీనితో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతగా వెయిట్ చేస్తున్నారో తెలియంది కాదు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన కంటెంట్ సినిమాపై ఉన్న అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌కు తీసుకెళ్లాయి. పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ పెంచుకున్న ఈ సినిమాకు.. ఓవ‌ర్‌సీస్‌లో సైతం వావ్ అనేలా ప్రీ సేల్స్ మొదలయ్యాయి.

ఈ నేపథ్యంలోనే ఈ చిత్రాన్ని అమెరికాలోనే ఎప్పుడు ఎవ‌రూ చేయ‌నంత గొప్ప‌గా రిలీజ్ చేయ‌టానికి ప్ర‌త్యాంగిర సినిమాస్ స‌న్నాహాలు చేస్తోంది. రీసెంట్‌ గానే ప్రీ బుకింగ్స్‌ ను యు.ఎస్‌లో ఓపెన్ చేయగా అక్కడ రచ్చరంబోలా అనేలా సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. ఇప్ప‌టికే ప్రీ సేల్స్ ఐదు ల‌క్ష‌ల డాల‌ర్స్‌ ను దాటేయ‌టం విశేషం. సినిమాపై ఉన్న బ‌జ్‌, ఊపు చూస్తుంటే ఇంకా ఈ లెక్క రోజు రోజుకీ పెరుగుతోందే కానీ త‌గ్గ‌దనేలా అనిపిస్తోంది. ఆడియెన్స్ ఎప్పుడెప్పుడు ఈ సినిమాటిక్ ఫీల్‌ను తెర‌పై ఎంజాయ్ చేద్దామా అని ఎదురు చూస్తున్నారు.

అభిమానులు టికెట్స్ కోసం ఎగ‌బ‌డుతున్న తీరు చూస్తుంటే ‘దేవ‌ర(Devara)’ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర సంచలనాలు క్రియేట్ చేయడం కాయమని అనిపిస్తోంది. అభిమానుల స్పీడ్ చూస్తుంటే యు.ఎస్‌లో ‘దేవ‌ర’ రికార్డ్ బ్రేకింగ్ ఓపెనింగ్ క‌లెక్ష‌న్స్ రాబట్టే అవకాశం అయితే లేకపోలేదు. త్వ‌ర‌లోనే రాబోతున్న ఈ మూవీ థియేట్రిక‌ల్ ట్రైల‌ర్‌తో ఈ అంచ‌నాలు నెక్ట్స్ లెవ‌ల్‌ కు రీచ్ అవుతాయ‌న‌టంలో అస్సలు సందేహమే లేదంటున్నారు మేకర్స్. 2

Also Read : Kamal Haasan: ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ కోర్సు నేర్చుకోవడానికి యూఎస్‌ వెళ్లిన కమల్‌ హాసన్‌ ?

DevaraJanhvi KapoorJr NTRkoratala sivaSaif Ali Khan
Comments (0)
Add Comment