Devara Collections : రిలీజైన 16 రోజులకే భారీ వసూళ్లు కొల్లగొట్టిన దేవర

సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా వసూళ్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు...

Devara : ఎన్టీఆర్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం ‘దేవర’ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భారీ వసూళ్లతో బాక్సాఫీస్‌ వద్ద దూసుకెళ్తోంది. 16 రోజుల్లోనే ఈ సినిమా రూ.500 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు చిత్రబృందం ఆదివారం ప్రకటించింది. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పోస్ట్‌ పెట్టింది. దీనిపై అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తూ.. మా హీరో కాలర్‌ ఎగరేసే సినిమా ఇచ్చాడని మెచ్చుకుంటున్నారు. యాక్షన్‌ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్‌, దేవర, వర అనే పాత్రల్లో కనిపించారు. జాన్వీకపూర్‌ కథానాయిక. సైఫ్‌ అలీఖాన్‌ ప్రతినాయకుడిగా కనిపించారు. సెప్టెంబర్‌ 27న విడుదలైంది.

Devara Collections Updates

సినిమాకు నెగటివ్‌ టాక్‌ వచ్చినా వసూళ్ల విషయంలో మాత్రం ఎక్కడా తగ్గలేదు. ఎన్టీఆర్‌ వన్‌ మ్యాన్‌ షో అని అభిమానులు, విమర్శకులు ప్రశంసించారు. దీనికి కొనసాగింపుగా ‘దేవర 2’ రానున్న విషయం తెలిసిందే. సీక్వెల్‌పై ఇటీవల కొరటాత శివ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మొదటి భాగం కంటే రెండోభాగం ఇంకా పవర్‌ఫుల్‌గా ఉంటుందని చెప్పారు. పార్ట్‌ 1లో చూసింది 10 శాతమేనని.. రెండో భాగంలో 100 శాతం చూస్తారన్నారు. ప్రతీ క్యారెక్టర్‌లో ట్విస్ట్‌ ఉంటుందని చెప్పారు దేవర పార్ట్‌ 1 విజయంతో మరింత బాధ్యత పెరిగిందని ఎన్టీఆర్‌ అన్నారు.

Also Read : Devara : దేవర కలెక్షన్స్ పై సంచలన ప్రకటన చేసిన నిర్మాత

CollectionsDevaraTrendingUpdatesViral
Comments (0)
Add Comment