Devara : పాన్ ఇండియా మూవీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సినిమా దేవర(Devara). యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కించిన ఈ సినిమా మరో ఆరు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ ఈ మూవీపై ఓ రేంజ్ ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది. ఇందులో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్, నటుడు సైఫ్ అలీ ఖాన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాలు ముంబై, చెన్నై, బెంగుళూరు వంటి ప్రాంతాల్లో దేవర టీం ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. ఈ హై వోల్టేజ్ యాక్షన్ మూవీగా వస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలతో బిజీగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా దేవర(Devara) మూవీ కోసం సినిమాటోగ్రాఫర్ రత్నవేలు వీఎఫ్ఎక్స్ గురించి పెట్టిన పోస్ట్ ఇప్పుడు అందరి అంచనాలను రెట్టింపు చేసింది.
Devara Movie Updates
ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈసినిమాలో వీఎఫ్ఎక్స్ కు ఎంతటి ప్రాముఖ్యత ఇచ్చారో తెలుస్తోంది. దీనిపై సినిమాటోగ్రాఫర్ రత్నవేలు సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టాడు. ‘ దేవర కలర్ గ్రేడింగ్, మ్యాచింగ్ భారీ వీఎఫ్ఎక్స్ షాట్ కోసం 30 రోజులకు పైగా నిద్రలేని రాత్రులు గడిపాం. ప్రీమియర్ లార్జ్ ఫార్మాట్, డీ బాక్స్, 4 డీఎక్స్, ఓవర్సీస్ 2.35 ఎమ్ఎమ్ కంపెనీలు కంటెంట్ ను సరైన సమయానికి అందించాయి. మా దేవరను థియేటర్లలో చూసి ఆనందించండి ‘ అంటూ ట్వీట్ చేస్తూ ఎన్టీఆర్ తో దిగిన ఫోటోతోపాటు.. వీఎఫ్ఎక్స్ వర్క్ కు సంబంధించిన ఫోటోస్ షేర్ చేశారు.
ఈ సినిమా విజువల్ వండర్ అని గతంలోనూ చెప్పుకొచ్చారు. ఇక ఈ సినిమాలో తారక్ డాన్స్, గ్రేస్ , స్టైల్, ఎలక్ట్రిపైయింగ్ స్టెప్స్ కు ఫ్యాన్స్ బ్రహ్మారథం పడతరాని.. థియేటర్లలో పక్కా అంటూ అభిమానులలో మరింత జోష్ నింపారు. ఈ సినిమా కథ చాలా పెద్దదని.. మొత్తం కథను తెరకెక్కిస్తే దాదాపు 9 గంటలు పడుతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు తారక్. ఇందుకో ఎక్కువగా ఫైట్స్, యాక్షన్ సీక్వెన్స్ లకే ప్రాధాన్యం ఉంటుందని తారక్ అన్నారు.
Also Read : 35 Chinna Katha Kaadu OTT : ఓటీటీలో నివేదా థామస్ ’35 చిన్న కథ కాదు’ సినిమా