Devaki Nandana Vasudeva: ‘దేవకి నందన వాసుదేవ’ సెకండ్ సింగిల్ జై బోలో కృష్ణ విడుదల !

‘దేవకి నందన వాసుదేవ’ సెకండ్ సింగిల్ జై బోలో కృష్ణ విడుదల !

‘దేవకి నందన వాసుదేవ’ సెకండ్ సింగిల్ జై బోలో కృష్ణ విడుదల !

సూపర్‌ స్టార్‌ కృష్ణ మనవడు అశోక్‌ గల్లా హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘దేవకి నందన వాసుదేవ’. ‘గుణ 369’ ఫేం అర్జున్‌ జంధ్యాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో వారణాసి మానస హీరోయిన్‌. నల్లపనేని యామిని సమర్పణలో సోమినేని బాలకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమాకు భీమ్స్‌ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సాంగ్, టీజర్, ఫస్ట్ లుక్ కు మంచి స్పందన వచ్చింది. ప్రముఖ పారిశ్రామికవేత్త, మాజీ ఎంపీ గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ కావడంతో పాటు సూపర్ స్టార్ కృష్ణ మనువడు కావడంతో ఈ సినిమాను గ్రాండ్ గా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జాంబిరెడ్డి ఫేం ప్రశాంత్‌ వర్మ కథనందిస్తుండటంతో అంచనాలు అమాంతం పెరిగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ఈ సినిమాకు సంబందించిన రెండో సింగిల్ ను విడుదల చేసారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.

శుక్రవారం సూపర్‌ స్టార్‌ కృష్ణ జయంతిని పురస్కరించుకుని ‘దేవకి నందన వాసుదేవ’ మూవీ నుంచి ‘జై బోలో కృష్ణ…’ అంటూ సాగే రెండో పాటని రిలీజ్‌ చేశారు. ఈ పాటకి రఘురామ్‌ సాహిత్యం అందించగా, స్వరాగ్‌ కీర్తన్‌ పాడారు. యష్‌ మాస్టర్‌ కొరియోగ్రఫీ చేశారు. ‘‘భక్తి అంశాలతో కూడిన ఫ్యామిలీ, యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. హీరో తన బ్యాచ్‌తో కలిసి కృష్ణుడి జన్మాష్టమిని సెలబ్రేట్‌ చేసుకునే సందర్భంలో ‘జై బోలో కృష్ణ…’ పాట వస్తుంది. ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని త్వరలో ప్రకటిస్తాం’’ అని యూనిట్‌ పేర్కొంది.

Ashok GallaDevaki Nandana VasudevaSuper Star Krishna
Comments (0)
Add Comment