Rajamouli : పాన్ ఇంటర్నేషనల్ మూవీగా తెరకెక్కుతోంది ఎస్ఎస్ఎంబీ29(SSMB29) చిత్రం. ఇప్పటికే కీలక షెడ్యూల్ పూర్తయింది. ఒడిశా అడవుల్లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరించారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి(Rajamouli). ఈ సినిమాలో ఇప్పటి వరకు మహేష్ బాబు, ప్రియాంక చోప్రా మాత్రమే కన్ ఫర్మ్ అయ్యారు. ప్రతి నాయకుడి పాత్రలో మలయాళ నటుడు, దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా జాయిన్ అవుతున్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. అయితే సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు ఒక్క మాట కూడా మాట్లాడలేదు డైరెక్టర్. ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్ డేట్స్ ఇచ్చేందుకు సుముఖంగా లేరు.
Rajamouli Movie Dialogue Writer Dev Katta
తాజాగా కీలక అప్ డేట్ వచ్చింది జక్కన్న మూవీ గురించి. ఈ సినిమాకు సంభాషణల (డైలాగ్ ) రైటర్ గా దేవ కట్టాను కన్ ఫర్మ్ చేశారు దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇద్దరూ కలిసి గతంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ప్రభాస్, అనుష్క నటించిన బాహుబలికి పని చేశారు. తను సంభాషణల రచయితగా ఆ సినిమాను ఓ రేంజ్ లో నిలిపేలా చేశాడు. దీంతో భారీ అంచనాలు నెలకొన్న ప్రిన్స్ మూవీకి ప్రత్యేకించి దేవకట్టాను ఎంపిక చేసుకున్నట్లు స్పష్టం చేశాడు జక్కన్న.
ఇక దేవ కట్టా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తను వెన్నెల, ప్రస్థానం, ఆటోనగర్ సూర్య వంటి చిత్రాలకు పని చేశాడు. విమర్శకుల ప్రశంసలు పొందాడు. ప్రపంచ వ్యాప్తంగా ఆర్ఆర్ఆర్ మూవీతో దర్శక ధీరుడు పాపులర్ అయ్యాడు. ఇటీవల ఆస్కార్ అకాడెమీ కీలక ప్రకటన కూడా చేసింది. సినిమా డిజైన్ కేటగిరీని కూడా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో ఆర్ఆర్ఆర్ కూడా ఉండడం విశేషం. అయితే దేవకట్టా చిత్ర నిర్మాత కూడా. బాహుబలి తొలి చిత్రం కాగా జక్కన్నతో దేవాకు ఇది రెండో చిత్రం కావడం గమనార్హం.
Also Read : Samantha Shocking :భారీ ఆఫర్లను తిరస్కరించిన సమంత