Demonte Colony 2: అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తాజా సినిమా ‘డిమోంటి కాలనీ 2(Demonte Colony 2)’. అరుణ్ పాండ్యన్ కీలక పాత్రల్లో నటించారు. 2015లో వచ్చి సంచలన విజయం సాధించిన డిమాంటే కాలనీకి సీక్వెల్ గా వచ్చిన ఈ ‘డీమాంటే కాలనీ 2(Demonte Colony 2)’ సినిమా రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఆగస్టులో బాక్సాఫీసు ముందుకొచ్చి, ప్రేక్షకులను థ్రిల్ చేసిన ఈ డిఫరెంట్ సూపర్ నేచురల్ హర్రర్ మూవీ ‘డిమోంటి కాలనీ 2(Demonte Colony 2)’… ‘జీ 5’ ఓటీటీ వేదికగా ఈ నెల 27 నుంచి తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
ప్రస్తుతం ఈ సినిమా స్ట్రీమింగ్ కు వచ్చిన కొన్ని గంటల్లోనే ప్రేక్షకులను భయపెడుతోంది. ఆసక్తికరమైన కథ… ఆద్యంతం ఉత్కంఠ రేపే కథనంతో సాగుతూ ప్రతి ఫ్రేమ్ చూసే వారిని భయపెడుతూ, వరుస ట్విస్టులతో సీట్ ఎడ్జ్ లో కూర్చోబెడుతుంది. అయితే ఫస్ట్ పార్ట్ చూసిన వారికి ఈ సినిమా కన్ఫ్యూజ్ లేకుండా అర్థమవుతుంది. సినిమాలో ఎలాంటి అసభ్య , అశ్లీల సన్నివేశాలు లేవు . కుటుంబ సభ్యలంతా కలిసి చూడవచ్చు కానీ గుండె జబ్బులు ఉన్నవారు… ఎక్కువగా భయ పడే వారు మాత్రం ఈ సినిమా చూడకపోవడం బెటర్ అనేలా ఉంది.
Demonte Colony 2 – ‘డిమోంటి కాలనీ 2’ కథేమిటంటే ?
క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది డెబీ (ప్రియ భవానీ శంకర్). అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో డెబీ తన భర్త ఆత్మహత్య వెనకున్న కారణమేంటన్నది అర్థం కాక మానసికంగా సతమతమవుతుంది. ఓ బౌద్ధ సన్యాసి (త్సెరింగ్ దోర్జీ) సాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సామ్ చదివిన ఓ పుస్తకమే అతని చావుకు కారణమని ఈ తరహాలోనే పలువురు మృత్యువాతపడ్డారని తెలుసుకుంటుంది.
మరోవైపు, అప్పటికే ఆ పుస్తకం చదివిన కవల సోదరులు శ్రీనివాస్ – రఘునందన్ (అరుళ్ నిధి)ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తిస్తుంది. దీంతో, ఈ వరుస చావులకు చెక్ పెట్టేందుకు ప్రియ తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో పాటు శ్రీనివాస్ సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి)తో కలిసి ఓ ప్రణాళిక రచిస్తుంది. మరి ప్రియ ప్రణాళిక ఫలించిందా ? రఘునందన్‌ను అతని సోదరుడిని ప్రాణాలతో రక్షించిందా? అసలు డిమోంటి కాలనీకి ఈ పుస్తకానికి ఉన్న లింకేంటి? డెబీ.. ఈ విషయాలన్నీ ఎలా తెలుసుకుంది? అసలు డిమోంటీ ఎవరు.. ఎందుకు చంపుతుంది అనే విషయాలను చాలా ఆశక్తికరంగా, సస్పెన్స్ గా తెరకెక్కించారు దర్శకుడు అజయ్ జ్ఞానముత్తు.
Also Read : Game Changer: సిక్కోలు నుండి సీమ వరకు భిన్న సంస్కృతులతో ‘గేమ్ ఛేంజర్’ పాట !