Demonte Colony 2: అరుళ్ నిధి, ప్రియా భవానీ శంకర్ ప్రధాన పాత్రల్లో దర్శకుడు ఆర్. అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన తాజా సినిమా ‘డిమోంటి కాలనీ 2(Demonte Colony 2)’. 2015లో వచ్చి సంచలన విజయం సాధించిన డిమాంటే కాలనీకి సీక్వెల్‌గా వచ్చిన ఈ ‘డీమాంటే కాలనీ 2’ సినిమా రూ.55 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ఆగస్టులో బాక్సాఫీసు ముందుకొచ్చి, ప్రేక్షకులను థ్రిల్ చేసిన హారర్ థ్రిల్లర్ ‘డిమోంటి కాలనీ 2(Demonte Colony 2)’ త్వరలో ఓటీటీ వేదికగా సందడి చేయనుంది. ఈ నెల 27 నుంచి ‘జీ 5’లో తెలుగు, తమిళ్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఈ వివరాలను సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సదరు సంస్థ కొత్త పోస్టర్ పంచుకుంది.
Demonte Colony 2 – ‘డిమోంటి కాలనీ 2’ కథేమిటంటే ?
క్యాన్సర్ బారిన పడి మృత్యువుతో పోరాడుతున్న సామ్ రిచర్డ్ (సర్జానో ఖలీద్)ను ప్రేమించి పెళ్లి చేసుకుంటుంది డెబీ (ప్రియ భవానీ శంకర్). అతడిని కంటికి రెప్పలా కాపాడుకుంటూ క్యాన్సర్ నుంచి కోలుకునేలా చేస్తుంది. కానీ, అంతలోనే సామ్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకుంటాడు. దీంతో డెబీ తన భర్త ఆత్మహత్య వెనకున్న కారణమేంటన్నది అర్థం కాక మానసికంగా సతమతమవుతుంది. ఓ బౌద్ధ సన్యాసి (త్సెరింగ్ దోర్జీ) సాయంతో తన భర్త ఆత్మతో మాట్లాడే ప్రయత్నం చేస్తుంది. సామ్ చదివిన ఓ పుస్తకమే అతని చావుకు కారణమని ఈ తరహాలోనే పలువురు మృత్యువాతపడ్డారని తెలుసుకుంటుంది.
మరోవైపు, అప్పటికే ఆ పుస్తకం చదివిన కవల సోదరులు శ్రీనివాస్ – రఘునందన్ (అరుళ్ నిధి)ల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నట్లు గుర్తిస్తుంది. దీంతో, ఈ వరుస చావులకు చెక్ పెట్టేందుకు ప్రియ తన మామ రిచర్డ్ (అరుణ్ పాండియన్)తో పాటు శ్రీనివాస్ సోదరుడు రఘునందన్ (అరుళ్ నిధి)తో కలిసి ఓ ప్రణాళిక రచిస్తుంది. మరి ప్రియ ప్రణాళిక ఫలించిందా ? రఘునందన్‌ను అతని సోదరుడిని ప్రాణాలతో రక్షించిందా? అసలు డిమోంటి కాలనీకి ఈ పుస్తకానికి ఉన్న లింకేంటి? అన్నది మిగతా కథ.
Also Read : Sandal Wood : శాండల్ వుడ్ ఇండస్ట్రీ లో అత్యవసర సమావేశాలు