Toronto Flight Flip : కెనడా – కెనడాలో ఘోర ప్రమాదం తప్పింది. అమెరికా నుంచి 80 మంది ప్రయాణీకులతో టొరెంటో(Toronto)కు డెల్టా విమానం బయలు దేరింది. దీంతో భారీగా మంచు కురుస్తుండడంతో ఎయిర్ పోర్ట్ లో ఫ్లైట్ సరిగానే ల్యాండ్ అయ్యింది. కానీ ఉన్నట్టుండి విమానం బోల్తా పడింది.
Toronto Flight Flip Shocking
ఈ ఘటనలో 18 మందికి పైగా ప్రయాణీకులు గాయపడ్డారు. దీంతో భద్రతా సిబ్బంది, అగ్ని మాపక అధికారులు హుటా హుటిన అంబులెన్స్ ల ద్వారా హెలికాప్టర్లలో ఆస్పత్రికి తరలించారు. అయితే ఎలాంటి ప్రాణ నష్టం చోటు చేసుకోలేదని స్పష్టం చేశారు టొరంటో ఎయిర్ పోర్టు అధికారులు.
ఇదిలా ఉండగా జెట్ లైనర్ నుండి భారీగా పొగలు రావడంతో అగ్ని మాపక సిబ్బంది విమానాన్ని నీటితో ఆర్పే ప్రయత్నం చేశారు. 76 మంది ప్రయాణీకులు, నలుగురు సిబ్బంది ఎండీవర్ ఎయిర్ ఫ్లైట్ 4819 మధ్యాహ్నం కెనడాలోకి చేరుకుంది.
అమెరికాలోని మిన్నె సోటాలోని మిన్నియాపాలిస్ నుండి బయలుదేరిందని ఎయిర్ లైన్ తెలిపింది. అయితే ప్రమాదానికి కారణం లేదా విమానం రెక్కలు తొలగి పోవడంతో ఎలా పల్టీ కొట్టిందో అనే విషయంపై ఇంకా వివరణ ఇవ్వలేదు.
ఇది చాలా తొందరగా మొదలైంది. మనం ఊహించక పోవడం చాలా ముఖ్యం. రన్‌వే పొడిగా ఉందని, ఎదురుగాలి పరిస్థితులు లేవని మాత్రం చెప్పగలమన్నారు ఎయిర్ పోర్ట్ అగ్నిమాపక అధికారి టాడ్ ఐట్కెన్.
Also Read : Bollywood Beauty Urfi Javed :ఉర్ఫీ జావెద్ ఎంగేజ్మెంట్