Deepika Padukone: బాఫ్టా అవార్డుల వ్యాఖ్యాతగా దీపిక పదుకొణె !

బాఫ్టా అవార్డుల వ్యాఖ్యాతగా దీపిక పదుకొణె !

Deepika Padukone: బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె మరో అరుదైన గుర్తింపు పొందింది. గతేడాది ఆస్కార్‌ అవార్డుల ప్రదానోత్సవ వేదికపై ‘నాటు నాటు’ పాటని పరిచయం చేసిన దీపికా పదుకొణె… ఇప్పుడు మరో భారీ అవార్డుల కార్యక్రమానికి హోస్ట్‌ గా వ్యవహరించడానికి సిద్ధమవుతోంది. హాలీవుడ్ లో సినీ పురస్కారాల్లో ప్రతిష్టాత్మకంగా భావించే బాఫ్టా (బ్రిటిష్‌ అకాడెమీ ఆఫ్‌ ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఆర్ట్స్‌) -2024 అవార్డుల ప్రధానోత్సవానికి… భారతదేశం తరపున ప్రాతినిధ్యం వహించడంతో పాటు ఆ షోలో యాంకర్ గా వ్యవహరించనుంది.

Deepika Padukone Viral

ఈ బాఫ్టా అవార్డుల ప్రధానోత్సవానికి హాలీవుడ్ సినీప్రముఖులతో పాటు క్రీడా దిగ్గజాలు కూడా పొల్గొంటారు. ఈ నేపథ్యంలో దీపిక పదుకొణె(Deepika Padukone)… సాకర్ దిగ్గజం డేవిడ్ బెక్ హాం, హాలీవుడ్ నటులు దువా లిపా, కేట్ బ్లాంచెట్ మరియు హిమేష్ పటేల్ వంటి ప్రముఖులతో కో యాంకర్ ( కో ప్రెజెంటేటర్) గా బాఫ్టా అవార్డుల ప్రధానోత్సవంలో సందడి చేయనున్నారు. ఈ మేరకు బాఫ్టా కమిటీ పంపించిన ఇన్విటేషన్ కమ్ కన్ఫర్మేషన్ లెటర్ ను ఆమె తన సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది. దీనితో ప్రస్తుతం ఆ లెటర్ ను వైరల్ చేస్తూ నెటిజన్లు… దీపిక కు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

ఇటీవల ఫైటర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకునే క్రేజ్ వేరే లెవెల్ అని చెప్పాలి. బాలీవుడ్, హాలీవుడ్ అని తేడా లేకుండా పలు భారీ చిత్రాల్లో నటించి విపరీతమైన ఫ్యాన్స్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్న దీపిక… గతేడాది అస్కార్ అవార్డుల ప్రధానోత్సవ వేదికపై ‘నాటు నాటు’ పాటని పరిచయం చేసింది. తాజాగా బాఫ్టా-2024 అవార్డుల ప్రధానోత్సవానికి ప్రెజెంటేటర్ గా వ్యవహరించనుంది. ఇక ఈ బాఫ్టా-2024 వేడుకల విషయానికి వస్తే ఈ నెల 18 (భారత కాలమానం ప్రకారం 19)న ఈ వేడుకలు జరగనున్నాయి. బ్రిటిష్‌ సినిమాలతోపాటు అంతర్జాతీయ చిత్రాలకు ఈ అవార్డులు అందజేస్తారు. భారతీయులు Lionsgate Play లో ఈ కార్యక్రమం ను ప్రత్యక్షంగా చూడవచ్చు.

Also Read : Emraan Hashmi: దక్షిణాది నిర్మాతలపై ఇమ్రాన్ హష్మీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ !

BAFTA 2024Deepika Padukone
Comments (0)
Add Comment