Deepika Padukone : మహానటి మూవీతో ఒక్కసారిగా అంతా తన వైపు చూసేలా చేసిన దర్శకుడు నాగ్ అశ్విన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను పీరియాడికల్ కథను తెరకెక్కించే ప్రయత్నం చేశాడు. అదే కల్కి. భారీ తారాగణంతో దీనిని తీశాడు. బ్లాక్ బస్టర్ మూవీగా నిలిచింది. అందరి అంచనాలు తలకిందులు చేస్తూ నిర్మాత అశ్వనీ దత్ కు కాసులు కురిపించేలా చేసింది. దీంతో ఈ మూవీ ఇచ్చిన కిక్ తో సీక్వెల్ గా కల్కి 2 ను తీస్తున్నాడు నాగ్ అశ్విన్.
Deepika Padukone Focus on..
కల్కిలో ప్రధాన పాత్రల్లో నటించారు పాన్ ఇండియా రైజింగ్ స్టార్ డార్లింగ్ ప్రభాస్. బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా పదుకొనే(Deepika Padukone), సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ కీ రోల్స్ పోషించారు. ఇందులో ప్రభాస్ తో పోటీ పడి నటించింది. ఇదే కాంబినేషన్ ను తిరిగి పునరావృతం చేస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం 25 శాతానికి పైగా షూటింగ్ పూర్తయిందని, ఈ ఏడాది డిసెంబర్ లో కల్కి2 విడుదల కానుందని ప్రకటించాడు నిర్మాత. ఇది పక్కన పెడితే దీపికా పదుకొనే మాత్రం గంపెడు ఆశలతో ఉంది ఈ సీక్వెల్ మూవీపై. తన పాత్ర ఎలా ఉండ బోతోందనేది సస్పెన్స్ లో ఉంచాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్.
Also Read : Beauty Meenakshi Trend : ఇసుక తిన్నెల్లో వెండి వెన్నెల