Beauty Deepika Padukone :భ‌యం ప్ర‌మాదం డిప్రెష‌న్ కు మూలం 

మోడీ ప‌రీక్షా పే చ‌ర్చాలో దీపికా ప‌దుకొనే 

Deepika Padukone : జీవితంలో రాణించాలంటే ముందు భ‌యాన్ని పోగొట్టుకోవాలి. చుట్టూ మ‌న వాతావ‌ర‌ణం ఆహ్లాద‌క‌రంగా, ఆనందంగా ఉండేలా చూసుకోవాలి. లేక‌పోతే మ‌న‌సు నిస్సారంగా మారిపోతుంది. అప్పుడు చ‌నిపోవాల‌న్న పిచ్చి ఆలోచ‌న‌లు మ‌న‌ల్ని చుట్టు ముడ‌తాయి.

Deepika Padukone Comments

మా నాన్న దేశం గ‌ర్వించ ద‌గిన బ్యాడ్మింట‌న్ ప్లేయ‌ర్ ప్ర‌కాశ్ ప‌దుకొనే. త‌న బాల్యం బాగానే గ‌డిచింది. కానీ అనుకోకుండా నా అంత‌కు నేను ఎందుక‌నో తెలియ‌కుండానే భ‌యాందోళ‌న‌కు గుర‌య్యే దానినని త‌న భావాల‌ను నిర్భ‌యంగా తెలియ చేసింది ప్ర‌ముఖ బాలీవుడ్ బ్యూటీ దీపికా ప‌దుకొనే(Deepika Padukone).

త‌ను ఇటీవ‌ల ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన మోడీ ప‌రీక్షా పే చ‌ర్చ‌లో పాల్గొంది. ఈ సంద‌ర్బంగా త‌న జీవితంలో తాను ఎదుర్కొన్న ఇబ్బందులు, ఇక్క‌ట్ల‌ను, డిప్రెష‌న్  గురించి తెలియ చేసింది. జీవితం ఎప్పుడూ సాఫీగా సాగ‌ద‌ని, అది గుర్తు పెట్టుకుంటే రోజూ గ‌డ‌ప‌డం చాలా సులువు అవుతుంద‌ని తెలిపింది దీపికా ప‌దుకొనే.

త‌ను ఇప్పుడు డిప్రెష‌న్ (మాన‌సిక కుంగు బాటు) పోగొట్టేందుకు సెంట‌ర్స్ ఏర్పాటు చేసింది. ఓ సంస్థ‌ను ప్రారంభించింది. మాన‌సికంగా చితికి పోయిన వాళ్ల‌కు స్వాంత‌న కూర్చేలా సెష‌న్స్ నిర్వ‌హిస్తోంది. మ‌రో వైపు సినిమాల‌లో కూడా బిజీగా ఉంటోంది.

గ‌త ఏడాది బాద్ షా షారుక్ ఖాన్ తో క‌లిసి న‌టించిన జ‌వాన్ దుమ్ము రేపింది. వేయి కోట్ల‌కు పైగా వ‌సూలు సాధించింది. దీనికి త‌మిళ ద‌ర్శ‌కుడు అట్లీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఇదే స‌మ‌యంలో మోడీతో మాట్లాడుతూ దీపికా ప‌దుకొనే త‌న‌కు చిన్న‌ప్పుటి నుంచి లెక్క‌లంటే భ‌యంగా ఉండేద‌ని, కానీ దానిని అధిగ‌మించాన‌ని పేర్కొంది.

Also Read : Hero Chiranjeevi Comment: ఆడ‌పిల్ల పుడుతుందేమోనని భ‌యంగా ఉంది

CommentsDeepika PadukoneViral
Comments (0)
Add Comment