Deepika Padukone Sensational :మ‌న‌కెందుకు ఆస్కార్ లు రావ‌డం లేదు..?

ఆవేద‌న వ్య‌క్తం చేసిన బాలీవుడ్ బ్యూటీ

Deepika Padukone : బాలీవుడ్ బ్యూటీ క్వీన్ దీపికా ప‌దుకొనే(Deepika Padukone) ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేసింది. ప్రపంచంలోనే అత్య‌ధిక సినిమాల‌ను ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేస్తున్న భార‌త దేశం నుంచి ఎందుక‌ని అత్యున్న‌త‌మైన ఆస్కార్ పుర‌స్కారాలు ద‌క్క‌డం లేదంటూ వాపోయింది. చిట్ చాట్ సంద‌ర్బంగా ఎంతో మంది ప్ర‌తిభా నైపుణ్యం క‌లిగిన ద‌ర్శ‌కులు, సాంకేతిక నిపుణులు, న‌టీ న‌టులు ఉన్నార‌ని కానీ ఇప్ప‌టి దాకా మ‌న దేశం నుంచి ఎంపికైంది చాలా త‌క్కువేన‌ని అన్నారు.

Deepika Padukone Sensational Comments on Oscar

మ్యూజిక్ డైరెక్ట‌ర్ రెహ‌మాన్, భాను అథ‌య్యా, ఆర్ఆర్ఆర్ మూవీ సాంగ్ , డాక్యుమెంట‌రీ ప‌రంగా ది ఎలిఫెంట్ త‌ప్పితే ఇప్ప‌టి దాకా ఆస్కార్ అవార్డులు రాలేక పోవ‌డం త‌న‌ను మ‌రింత బాధ‌కు గురి చేసింద‌న్నారు దీపికా ప‌దుకొనే. అయితే ప్ర‌పంచంతో ప‌డేలా మ‌న సినిమాలు ఉన్నా ఎక్క‌డో అన్యాయం మ‌న‌కు జ‌రుగుతోంద‌న్న ఫీలింగ్ త‌న‌కు క‌లుగుతోంద‌న్నారు బాలీవుడ్ క్వీన్.

అయితే ఆర్ఆర్ఆర్ మూవీలో తాను న‌టించ లేక పోయిన‌ప్ప‌టికీ తాను ఒక భార‌తీయురాలిగా, న‌టిగా ఆ సినిమాకు అవార్డు ద‌క్క‌డం ప‌ట్ల చాలా సంతోషానికి లోనైన‌ట్లు తెలిపింది. ఇదిలా ఉండ‌గా ఈసారి జ‌రిగిన ఆస్కార్ అవార్డుల‌లో ది బ్రూట‌లిస్ట్ చిత్రానికి గాను అడ్రిన్ బ్రాడ్ ది బెస్ట్ యాక్ట‌ర్ అవార్డుకు ఎంపిక కావ‌డం ప‌ట్ల సంతోషం వ్య‌క్తం చేశారు. త‌ను ఆ పుర‌స్కారానికి అన్ని విధాలుగా అర్హుడ‌ని చెప్పింది. త‌ను టాప్ హీరోల‌తో క‌లిసి న‌టించింది. గ‌త ఏడాది క‌ల్కి మూవీలో న‌టించింది.

Also Read : Actor Raghubabu Shocking :ట్రోలింగ్ జోరు ర‌ఘుబాబు బేజారు 

CommentsDeepika PadukoneOscar AwardsViral
Comments (0)
Add Comment