Deepika Padukone: ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న దీపికా పదుకొణె కంపెనీ !

ముంబైలో ఖరీదైన అపార్ట్‌మెంట్‌ కొన్న దీపికా పదుకొణె కంపెనీ !

Deepika Padukone: బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ దీపికా పదుకొణెకు చెందిన కేఏ ఎంటర్‌ప్రైజెస్ సంస్థ లగ్జరీ అపార్ట్‌మెంట్‌ కొనుగోలు చేసింది. ముంబైలోని బాంద్రా వెస్ట్ ప్రాంతంలో రూ.17.8 కోట్లకు 1845 చదరపు అడుగుల అపార్ట్‌ మెంట్‌ను కొనుగోలు చేసినట్లు తెలిసింది. ప్రాపర్టీ రిజిస్ట్రేషన్‌ ల సమాచారాన్ని సేకరించే జాప్‌ కీ సంస్థకు లభించిన పత్రాలు ఈ కొనుగోలు వివరాలను వెల్లడించాయి. ఈ సేల్ డీల్ సెప్టెంబర్ 12న నమోదైంది. ఎనార్మ్‌ నాగ్‌పాల్‌ రియాల్టీ సంస్థ విక్రేత కాగా దీపికా పదుకొణె(Deepika Padukone) కంపెనీ కేఏ ఎంటర్‌ప్రైజెస్ కొనుగోలుదారుగా పత్రాలు చూపించాయి.

Deepika Padukone Buy..

దీపికా పదుకొణె కంపెనీ అపార్ట్‌మెంట్ కొనుగోలు చేసిన సాగర్ రేషమ్ కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీని ఎనార్మ్ నాగ్‌పాల్ రియాల్టీ సంస్థ అభివృద్ధి చేసింది. ఇందులో 4బీహెచ్‌కే, 5 బీహెచ్‌కే అపార్ట్‌మెంట్‌ లు ఉన్నాయి. కంపెనీ కొనుగోలు చేసిన ఫ్లాట్ 15వ అంతస్తులో ఉంది. బిల్ట్-అప్ ఏరియా రేటు చదరపు అడుగుకు రూ. 96,400. ఈ డీల్‌కు స్టాంప్ డ్యూటీ దాదాపు రూ. 1.07 కోట్లు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు రూ. 30,000 చెల్లించినట్లు తెలుస్తోంది.

బాలీవుడ్‌ స్టార్‌ కపుల్‌ దీపికా పదుకొణె, రణవీర్ సింగ్ ఇటీవలే తమ మొదటి బిడ్డకు జన్మనిచ్చారు. కాగా ఈ దంపతులు కొనుగోలు చేసిన మరొక ప్రాపర్టీ షారూఖ్ ఖాన్ రాజభవనం మన్నత్‌ కు సమీపంలోని బాంద్రా బ్యాండ్‌ స్టాండ్‌ లో సముద్రానికి ఎదురుగా ఉన్న క్వాడ్రప్లెక్స్. దీని విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని సమాచారం. ఈ జంట 2021లో అలీబాగ్‌ లో రూ. 22 కోట్ల విలువైన బంగ్లాను కూడా కొనుగోలు చేశారు.

Also Read : Pailam Pilaga: సాయి తేజ ‘పైలం పిలగా’ రిలీజ్‌ డేట్‌ ఫిక్స్‌ !

Deepika PadukoneMumbairanveer singh
Comments (0)
Add Comment