Hero Nithin-Robinhood :నితిన్ రాబిన్ హుడ్ మూవీలో వార్న‌ర్

క‌న్ ఫ‌ర్మ్ చేసిన మూవీ మేక‌ర్స్ 

Robinhood : ప్ర‌ముఖ ఆస్ట్రేలియ‌న్ క్రికెట‌ర్ డేవిడ్ వార్న‌ర్(David Warner) గురించి ప‌రిచ‌యం చేయాల్సిన ప‌నిలేదు. ఆయ‌న తెలుగు వారికి అత్యంత ఆత్మీయుడిగా మారి పోయాడు. అటు క్రికెట‌ర్ గా ఇటు పాపుల‌ర్ తెలుగు పాట‌ల‌కు రీల్స్ చేస్తూ మ‌రింత ద‌గ్గ‌ర‌య్యాడు. త‌ను తెలుగు మూవీలో  న‌టిస్తున్నాడ‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న కూడా వెలువ‌డ‌లేదు. కానీ తాజాగా కీల‌క అప్ డేట్ వ‌చ్చింది.

Hero Nithin Robinhood Movie Updates

అదేమిటంటే నితిన్ రెడ్డి, ల‌వ్లీ బ్యూటీ శ్రీ‌లీల క‌లిసి న‌టిస్తున్న చిత్రం రాబిన్ హుడ్. ఈ చిత్రం షూటింగ్  శ‌ర‌వేగంగా జ‌రుపుకుంటోంది. మార్చి 28న ప్రేక్ష‌కుల ముందుకు తీసుకు రావాల‌ని డిసైడ్ అయ్యారు. ఇప్ప‌టికే ఈ సినిమాకు సంబంధించి విడుద‌ల చేసిన రెండు పాట‌లు దుమ్ము రేపాయి. చార్ట్స్ టాప్ లో కొన‌సాగుతున్నాయి. రాబిన్ హుడ్ కు త‌మిళ స్టార్ మ్యూజిక్ డైరెక్ట‌ర్ జీవీ ప్ర‌కాశ్ మ్యూజిక్ ఇచ్చాడు.

ఇక డేవిడ్ వార్న‌ర్ కు తెలుగు సినిమాల‌న్నా, హీరోల‌న్నా, పాట‌లంటే చ‌చ్చేంత ఇష్టం. ఆయ‌న గ‌తంలో ఐపీఎల్ కు సంబంధించి స‌న్ రైజ‌ర్స్ హైద‌రాబాద్ జ‌ట్టుకు ప్రాతినిధ్యం వ‌హించాడు. ఆ జ‌ట్టుకు కెప్టెన్ గా చేశాడు. త‌న సార‌థ్యంలోనే ఐపీఎల్ క‌ప్ గెలుచుకుంది.

పాపుల‌ర్ సాంగ్స్ త‌న‌తో పాటు భార్య‌, కొడుకుతో క‌లిసి పాట‌ల‌కు రీల్స్ చేశాడు. మ‌రింత పాపుల‌ర్ అయ్యాడు. త‌న పాపులారిటీని దృష్టిలో పెట్టుకుని ద‌ర్శ‌కుడు రాబిన్ హుడ్ లో ఓ స్పెష‌ల్ కేరెక్ట‌ర్ లో న‌టింప చేశాడ‌ని టాక్.

Also Read : Hero Nani- Hit 3 :నాని హిట్ 3 పై స్టార్ ప్రొడ్యూస‌ర్ ఫోక‌స్

CinemaDavid WarnerNithinRobinhoodTrendingUpdates
Comments (0)
Add Comment